మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్,ఏఎం రత్నం, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, వంశీ పైడిపల్లి, సంపత్ నంది, బుచ్చిబాబు సాన తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అమ్మ ప్రేమ ఏనాటికి పాతదవదు బోర్ కొట్టదు. అలాగే అభిమానులు చూపించిన ప్రేమ కేరింతలు ఎప్పుడు విన్నా ఫ్రెష్ గా వుంటుంది. ఎప్పుడు చెవినపడ్డా హృదయాన్ని కదిలిస్తుంది. భగవంతుడు నాకు ఇలాంటి జన్మ ఇచ్చినందుకు సర్వాద కృతజ్ఞుడినై వుంటాను. అభిమానులు గర్వపడేలా వుండాలని అభిమానుల కోసం నా వ్యక్తిత్వాన్ని నడవడికని మార్చుకుంటూ వచ్చాను, ఇంతమందికి స్ఫూర్తిదాయకంగా వున్న నేను ఆచితూచి అడుగులు వేయాలని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ‘మా అన్నయ్య’ అని మీరంతా గర్వంగా చెప్పుకునేలా ఈ స్థాయికి వచ్చాను. ఖైదీ నెంబర్ 150లో నాకు నచ్చితేనే చేస్తాను, నాకు నచ్చితేనే చూస్తాను’ అనే డైలాగ్ వుంది. భోళా శంకర్ నాకు నచ్చింది కాబట్టే చేశాను. నాకు నచ్చింది కాబట్టే చూశాను. అంతగా నచ్చిన సినిమా మీ అందరి చేత మార్కులు వేయించుకుంటుదనే ధైర్యంతోనే ఆగస్ట్11న సినిమాని మీ ముందుకు రాబోతుంది. మంచి కంటెంట్ వున్నపుడు రీమేక్ చేయడంలో తప్పులేదు. వేదాళం మంచి సినిమా. ఓటీటీ వేదికలపై ఎక్కడా లేదు. ఎవరూ చూసివుండరు. అలాంటి మంచి కంటెంట్ ప్రేక్షకులకు చూపించాలానే ఉద్దేశంతో భోళా శంకర్ చేశాం. ఈ సినిమా షూటింగ్ చాలా ఉత్సాహంగా గడిచింది. ఇంత ఉత్సాహం ఎందుకంటే.. ఈ సినిమా ఆల్రెడీ మా మనసుల్లో సూపర్ హిట్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చేసింది. మెహర్ రమేష్ మా కుటుంబ సభ్యుడు. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు. తనకి దర్శకుడు కావాలనే కోరిక కూడా నన్ను చూసే కలిగింది. ఐతే దర్శకుడిగా మాత్రం తన స్వయంకృషి తోనే ఎదగాలని కష్టపడ్డాడు. మొన్న బ్రో వేడుకలో కళ్యాణ్ బాబు చెప్పినట్లు ఇండస్ట్రీ అనేది ఒకరిసొత్తు కాదు. ఇది అందరిది. ప్రతిభని ప్రోత్సహించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రతిభని ప్రోత్సహించడం నా భాద్యత. కొత్తరక్తం వస్తేనే కొత్త ఎనర్జీ వస్తుంది. ఇండస్ట్రీ అక్షయ పాత్ర లాంటింది. ఎంతమంది వచ్చినా సరే అన్నం పెడుతుంది. కేవలం స్టార్స్ మాత్రమే వుండే ఇండస్ట్రీలో ఇక్కడ రాణిస్తాననే గట్టి నమ్మకంతో వచ్చాను. మొదట్లో చిన్న వేషాలు చేసినప్పటికీ నా ప్రతిభపై నమ్మకం వుంది. కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ చిత్రాలలో నావి చిన్న పాత్రలే. ఐతే అవి చేయనంటే నా భవిష్యత్ ప్రభావం పడుతుందనే భయంతోనే వాటిని చేశాను. అయితే ఈ ఇండస్ట్రీ నన్ను ఆదరించింది ప్రోత్సహించిందనే కంటే నన్ను ప్రోత్సహించి భూజనకెత్తుకుంది ప్రేక్షకులు. ఇది సత్యం. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే వుండేది. నవయుగ, పూర్ణ, లక్ష్మీ,, ఇలాంటి సంస్థలు వున్నాయి. వాళ్ళు ఓకే అంటేనే డబ్బులు ఇస్తేనే నిర్మాతలు సినిమా తీసేవారు. అలాంటి సంస్థ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నాతో సినిమా చేయాలని ఆసక్తి చూపారు. డ్యాన్సులు బాగా చేస్తున్నాడు, ఫైట్స్ చేస్తున్నారు, అతను వుంటే ప్రేక్షకులు వస్తున్నారు. అతనితో సినిమా ఎందుకు తీయకూడదని అన్నారు. ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తుంది కాబట్టి నిర్మాతలు నాకు హీరోగా అవకాశాలు ఇస్తూ కమర్షియల్ హీరోగా చేశారు. అందుకే నా జీవితంలో ముందుగా కృతజ్ఞతలు వుండేది నన్ను ఆదరించిన ప్రేక్షకులపైనే. నా ప్రతిభని గుర్తించిన ప్రేక్షకులే లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడని కాదు. అందుకే నేను ఏది చేసిన ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారనేదానిపైనే నా ద్రుష్టి వుంటుంది. నన్ను ఆదరించింది చేయూత నిచ్చింది ప్రేక్షకులు, ఆ తర్వాత పరిశ్రమ. ఎవరు ముందు ఇచ్చిన నాకు సర్వాద కృతజ్ఞత వుంటుంది. మిల్కీబ్యూటీ పాటలో ఇంత యంగ్ గా ఎలా కనిపిస్తున్నారని అడుగుతున్నారు. ఇది అభిమానులు ఇచ్చిన ఎనర్జీ. ఇది నా గుండెలోపలి నుంచి వచ్చే మాట. దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేశాడు. ఇండస్ట్రీలో మరో తమ్ముడని గర్వించేలా ఈ సినిమా విజయం ద్వారా మీ ఆశీస్సులు కూడా పొందుతారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ప్రాణం పెట్టి ఫైట్స్ డిజైన్ చేశారు. డడ్లీ అద్భుతమైన పని తీరు కనబరిచారు. చాలా అందంగా చూపించారు. తనతో మళ్ళీ వర్క్ చేయాలనీ వుంది. పాత్ర నిడివి ఎంత ఉన్నా సరే నటిస్తానంటూ ముందుకొచ్చిన సుశాంత్‌కు థ్యాంక్స్. నాతో డ్యాన్స్ చేసినప్పుడు ఒకవైపు టెన్షన్ మరో వైపు ఎక్సయిట్ మెంట్ తో వున్నాడు. తన హుషారు తెరపై చూస్తారు. ఆది, గెటప్ శీను, లోబో, వేణు , బిత్తిరి సత్తి ఇలా ఎంతోమంది నటీ నటులతో సెట్స్ లో సందడిగా వుండేది. ఇందులో శ్రీముఖి తో కొన్ని సన్నివేశాలు వుంటాయి, అందులో నేను కాదు కళ్యాణ్ బాబు గుర్తుకువస్తారు ( నవ్వుతూ).
తమన్నా ఇందులో మాస్ కామెడీ పాత్ర చేసింది. తన పాత్ర చాలా బావుంటుంది. కీర్తి సురేష్ మహానటి. మా ఇంట్లో బిడ్డల అనిపిస్తుంది. మేమిద్దరం ఇందులో అన్నాచెల్లెలుగా నటించాం. అది సినిమా వరకే పరిమితంకావాలని, బయట అన్నయ్య అని పిలవొద్దని చెప్పా (నవ్వుతూ). మహానటి చిత్రంలోని కీర్తి నటన చూశాక నాకు మాటలు రాలేదు. మీ అమ్మాయికి జాతీయ అవార్డ్ వస్తుందని వాళ్ళ అమ్మగారితో చెప్పాను. నా వాక్కు నిజమైంది. భోళా శంకర్ లో మా ఇద్దరి సీన్స్ పండుతాయి. మణిశర్మ గారి అబ్బాయి మహతి స్వరసాగర్ అద్భుతమైన సంగీతం అందించాడు. అన్ని రకాల పాటలు ఇచ్చారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాశ్ టాలెంట్ తో కట్టిపడేశారు. ఈ సినిమాలో అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ ఇంకా పనిలో నిమగ్నమై ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ అన్ని పాటలకు మంచి డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర గారి తండ్రి రామ్ బ్రహ్మం సుంకర. ఆయన పేరు వేస్తే ఆయన ఆశీస్సులు ఉన్నట్లే. అనిల్ గారికి సినిమా అంటే ప్యాషన్. ఆయనకికి డబ్బు కంటే విజయం ముఖ్యం. ఇటివలే సామజవరగమన అనే చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించారు. ఆయన మొహంలో నవ్వు చూస్తుంటే భోళా విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మీ అందరి ఆశీస్సులలతో భోళా శంకర్ తప్పకుండా హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన నటినటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో భోళా శంకర్ నాకు ‘వాల్తేరు వీరయ్య’ కు మించిన హిట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు చూడనికి సక్సెస్ లేదు. మీరంతా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగితే నేను ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగాను. చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో చెప్పుకోవాల్సిన పనిలేదు. 12 ఏళ్ల క్రితం చిరంజీవి గారు చేసిన సేవలపై ఒకరు నీచంగా మాట్లాడితే 12ఏళ్ళు పోరాడి జైలుకి వెళ్ళే వరకూ ఊరుకోలేదు. మెహర్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అనిల్ నాకు మంచి స్నేహితుడు. ఇంత మంచి వాళ్ళు కలసి తీసుస్తున్న సినిమాని ఖచ్చితంగా హిట్ కావాలి’’ అని కోరారు.
దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. నేను అన్నయ్య చిరంజీవి గారి అభిమానుల్లో నుంచి వచ్చినవాడినే. అన్నయ్యతో సినిమా చేయగలగడం నా అదృష్టం. షాడోలో వున్న నాపై మెగాస్టార్ వెలుగు పడింది. దర్శకుడిగా నాకు ఇది పునర్జన్మ. సరిలేరు నీకెవ్వరు సమయంలో చిరంజీవిగారితో సినిమా చేయాలని అనిల్ గారు కోరారు. నేను అన్నయ్యని ఎంత ప్రేమిస్తున్నానో నాలానే అనిల్ గారు కూడా అన్నయ్యకి అంత దగ్గరరయ్యారు. కలని నిజం చేసిన అనిల్ గారికి థాంక్ యూ. మేము అనుకున్నది వచ్చింది. అన్నయ్య మీద ప్రేమ అభిమానం తో మా కుటుంబ సభ్యులు మమ్మల్ని పెంచారు. ఇవాళ భోళా శంకర్ సినిమా చేయడం అనేది అన్నయ్య నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఒక గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు ఎలా వుంటుందో ఈ జనరేష్ కి అలా ఉండేలా మా టీం అంతా కష్టపడి భోళా ని అందించాం. ఈ సినిమాకి పని చేసిన అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్. టీం అందరి సపోర్ట్ తో భోళా శంకర్ ని ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కీర్తి సురేష్ అద్భుతంగా నటించారు. అన్నయ్య మీద వున్న అభిమానాన్ని చూపించడానికి ఈ జన్మ సరిపోదు. అన్నయ్య ప్రేమ ఇవ్వడం తప్పితే మరేది తెలీదు. అన్నయ్య లాంటి ప్రేమమూర్తిని ఎక్కడ చూడలేదు. నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ ని చేసింది కూడా అన్నయ్యే. గ్యాంగ్ లీడర్ లో చివరి షాట్ ని ఆయనే డైరెక్ట్ చేసినప్పుడు నేను సహయకుడిగా వున్నాను. అల్లు అరవింద్ గారికి, రామ్ బ్రహ్మం సుంకర గారికి కృతజ్ఞతలు. అన్నయ్య ఎంటర్ టైన్మెంట్ రారాజు. భోళా శంకర్ తో మీ అందరినీ అలరిస్తారు. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. చిరంజీవి గారి తో సినిమా చేయాలనేది నా కల. అది ఈ సినిమాతో తీరింది. ఇది నాకు లైఫ్ టైం ఎచీవ్ మెంట్. మెహర్ రమేష్ గారి థాంక్స్. ఈ సినిమా జర్నీలో చిరంజీవి గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. చిరంజీవి గారిని నటుడు డ్యాన్సర్ ఫైటర్ తో పాటు ఆయనలోని మానవతవాదిగా చూశాను. నేను కలసిన అద్భుతమైన వ్యక్తి చిరంజీవి గారు. ఆయనతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని వుంది. ఈ సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. మెహర్ రమేష్ గారు చాలా పాజిటివ్ పర్శన్. సినిమా కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కి కావాల్సిన ప్రతిది ఇందులో వుంటుంది. ఇందులో కీర్తి సురేష్ సిస్టర్ రోల్ ఆమె కంటే ఎవరూ బెటర్ గా చేయలేరు. అద్భుతంగా చేసింది. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేడుకకు వచ్చిన అల్లు అరవింద్ గారికి , దర్శకులకు, అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు. ఆగస్ట్ 11న అభిమానులకు గిఫ్ట్ ఇస్తున్నాం’’ అన్నారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ .. సినిమాలో బ్రదర్ సిస్టర్ మెయిన్ ట్రాక్ వుంది. దీంతో పాటు ఈ సినిమాతో నాకు మెహర్ అన్న రూపంలో మరో బ్రదర్ దొరికారు. నన్ను మహాలక్ష్మీగా నమ్మినందుకు ధన్యవాదాలు. డడ్లీ గారు చాలా అందంగా చూపించారు. సుశాంత్ , తమన్నా తో కలసి పని చేయడం ఆనందగా వుంది. ఈ సినిమాలో చిరంజీవి గారితో కలసి ముఖ్యమైన పాత్ర పోషించడం ఆనందంగా వుంది. ఈ సినిమా చేయకముందు చిరంజీవి గారు మెగాస్టార్ అని తెలుసు. కానీ మెగా హ్యుమన్ ని సినిమా చేసిన తర్వాతే తెలిసింది. షూటింగ్ లో అందరినీ ఎంతో కంఫర్ట్ బుల్ గా చూసుకున్నారు. ఎనర్జీ, డెడికేషన్, సమయపాలన .. ఇలా చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకోవాలి. చిరంజీవి గారి ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ రోజు పెట్టినందుకు థాంక్ యూ సో మచ్.( నవ్వుతూ) ఆగస్ట్ 11న సినిమా విడుదలౌతుంది. సినిమా పెద్ద హిట్ కావాలి’అని కోరారు.
సుశాంత్ మాట్లాడుతూ.. చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టం. అలాంటి ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్ గారికి థాంక్స్. మెహర్ గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఇందులో నన్ను చాలా స్టైలిష్ గా ప్రజంట్ చేశారు, నిర్మాత అనిల్ సుంకర గారికి సినిమా అంటే ఇష్టం. భోళా శంకర్ చిరంజీవి గారు, కీర్తి సురేష్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ వుండే సినిమా. తమన్నా లీడ్ రోల్ చేశారు. నాది ఒక క్యామియో రోల్. ఈ భోళా మానియాలో నా పాత్రని ఒక చిరుగాలిలా ప్రజంట్ చేశారు. నవరసాల్లో అన్ని చేస్తేనే స్టార్ అవుతారు. చిరంజీవి గారు అన్నిట్లో ఆల్ రౌండర్ కాబట్టి మెగాస్టార్ అయ్యారు. డ్యాన్స్ అనేది తెలుగు కల్చర్ లోనే వుంది. రౌడీ అల్లుడు షూటింగ్ లో చిరంజీవి గారిని తొలిసారి కలిశాను. అప్పటికే చిరంజీవి గారి పాటలకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడని. ఇప్పుడు ఆయనతో కలసి సినిమా చేయడం ఆనందంగా వుంది. చిరంజీవి గారితో డ్యాన్స్ చేయడం నాకు లైఫ్ టైం మెమరీ. మా జనరేషన్ కి డ్యాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నా మనసులో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఎక్స్ పీరియన్స్ వచ్చేసింది. ఆగస్టు 11న ఫ్యాన్స్ తో కలసి భోళా శంకర్ చూస్తాను’’అన్నారు
దర్శకుడు బాబీ మాట్లాడుతూ..నేను దర్శకుడు కావడానికి ముందు మెహర్ రమేష్ గారు ఇచ్చిన మోరల్ సపోర్ట్ ఇంత అంత కాదు. ఈ సినిమా కోసం ఎంతో ఓపిగ్గా పాజిటివ్ గా వున్నారు. మెహర్ అన్న మంచితనానికి భోళా సినిమా ఎలా ఐతే వచ్చిందో తన కష్టానికి ప్రేక్షకులకు కూడా ప్రతిఫలం ఇస్తారు. వాల్తేరు వీరయ్య వచ్చి ఎనిమిది నెలలు ఎలా గడిచిపోయాయో తెలీదు, ఎక్కడికి వెళ్ళిన అదే గౌరవం మర్యాద నమ్మకం ఇస్తుంది. చిరంజీవి గారి నుంచి కష్టపడటం నేర్చుకున్నాను. భోళా శంకర్ చిత్రాన్ని అనిల్ గారు ఒక అభిమాని గా నిర్మించారు. ఈ సినిమా ఆయనకి అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను. టీం అందరికీ అల్ ది బెస్ట్. ఆగస్ట్ 11న అభిమానులతో కలసి భోళా శంకర్ చూస్తాను’’ అన్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. భోళా శంకర్ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఈ సినిమాని థియేటర్ లో ఎప్పుడు చూద్దానే ఆసక్తి పెరిగిపోతుంది. మెగాస్టార్ ని ఎలా చూడాలని అనుకుంటామో ఆ గ్రేస్ స్టైల్ టైమింగ్ ఎక్స్ టార్డినరిగా వుంది. స్టాలిన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. చిరంజీవి గారు నా పని చూసి ఓ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు. నీ టైం బావుంటుందని చెప్పారు. అప్పుడు నేను ఎవరో ఎవరికీ తెలీదు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ నేను దర్శకుడు కావడానికి ఒక బలంలా పని చేసింది. మెహర్ రమేష్ గారు ఎంతో స్వచ్ఛమైన మనిషి. నేను సహాయ దర్శకుడిగా వున్నపుడు ఎంతో సపోర్ట్ చేశారు. చిరంజీవి గారు చూడని బ్లాక్ బస్టర్స్ లేవు. మెహర్ రమేష్ గారి కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు
వంశీ పైడి పల్లి మాట్లాడుతూ.. మెహర్ రమేష్ లాంటి ఫ్రండ్ వుంటే చాలా ధైర్యంగా ఉండొచ్చు. కరోనా సమయంలో చిరంజీవి గారు ఒక ట్రస్ట్ పెట్టి కార్మికులకు సాయం అందించారు. ఇందులో మెహర్ కీలక పాత్ర పోషించారు. చాలా కష్టపడ్డాడు. చిరంజీవి గారికి మెహర్ వీరాభిమాని. మెహర్ చేసిన మంచి పనులకు దేవుడు ఇచ్చిన వరం చిరంజీవి గారితో పని చేసే అవకాశం రావడం. ఈ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మెహర్ కంటే నేను బలంగా కోరుకుంటున్నాను. చిరంజీవి గారి వలనే సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. ఆయన ముందు నిలబడి మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నాను. కీర్తి సురేష్ మా ఫ్యామిలీ మెంబర్ లా వుంటుంది. భోళా శంకర్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు
బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. చిరంజీవి గారి ప్రేమ తప్ప ఏమీ చెప్పలేను. మెహర్ రమేష్ గారు ఫ్యాన్ మేడ్ ఫిల్మ్ గా భోళా శంకర్ ని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని కోరారు
దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ… చిరంజీవి గారి సినిమాలు లేకపోతే నేను సినిమాల్లో ఉండేవాడిని కాదు. రచ్చ కథ ఓకే చేయకపోయి వుంటే నాకు సినిమా కెరీర్ వుండేదికాదు. చిరంజీవి గారిని ప్రేమించడం ఆయన సినిమాలని ఎంజాయ్ చేయడం తప్ప మేము చేసిది ఏమీ లేదు. ఈ సినిమా ఆరంభం నుంచి మెహర్ రమేష్ గారి ఎక్సయిట్మెంట్ చూస్తున్నాను. ఆగస్ట్ 11 మెహర్ రమేష్ గారి జీవితంలో మర్చిపోలేని అవుతుందని నమ్ముతున్నాను. అల్ ది బెస్ట్’’ అన్నారు
నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. చిరంజీవి గారికి నేను పెద్ద అభిమానిని. గత నలబై ఏళ్లలో రెండు మూడు చిత్రాలు తప్పితే మిగతా చిరంజీవి గారి అన్ని చిత్రాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. యుఎస్ వెళ్ళిన మొదటి ఏడాది చూడలేకపోయాను. చూడాలని వుంది ,ఇంద్ర చిత్రాలు ఇండియాలో ఫస్ట్ డే చూశాను. శంకర్ దాదా ఎంబీబీఎస్ కాలిఫోర్నియాలో చూశాను. స్టాలిన్ నుంచి సియాటిల్ లో ఫస్ట్ డే రిలీజ్ చేసుకోవడానికి వీలుగా చేసి మొదటి రోజే చూడడం స్టార్ చేశాను. కళ్యాణ్ గారిని చూడటమే గొప్ప విషయం అనుకుంటే ఆయనతో క్లాసిక్ కమర్షియల్ బ్రో సినిమా చేయగలిగాను. ఈ రోజు చిరంజీవి గారి ముందు నిలబడి మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను. మా స్నేహితుడు అనిల్ సుంకర ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. మెహర్ రమేష్ తో కలసి భోళా శంకర్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్’’ తెలిపారు.
ఎఎం రత్నం మాట్లాడుతూ.. చిరంజీవి గారి అంకితభావం, సమయపాలన స్ఫూర్తిదాయకం. స్నేహం కోసం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు నేను, డైరెక్టర్ గారు ఆలస్యంగా వెళ్లాం ఈ లోపు చిరంజీవి గారు సెట్స్ లోకి వచ్చేశారు. చాలా కంగారు పడ్డాం. మరో రోజు మాకు కారు రాకపోతే చిరంజీవి గారు వచ్చేస్తారేమో అని అటోలో వచ్చేశాం. అప్పటికి ఇప్పటికి ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఆయన సమయపాలన. భోళా శంకర్ పెద్ద హిట్ కావాలని, అనిల్ గారికి భారీ విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
శ్రీముఖి మాట్లాడుతూ .. చిరంజీవి గారితో సినిమా చేయడం నా అదృష్టం. ఈ పాత్ర నేను చేయగలుగుతానని నమ్మిన దర్శకుడు మెహర్ రమేష్ గారికి ధన్యవాదాలు. కీర్తి సురేష్ తో పని చేయడం ఆనందంగా వుంది. భోళా శంకర్ లో భాగం కావడం లక్కీగా ఫీలౌతున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
హైపర్ ఆది మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమని ముఫ్ఫై ఏళ్ళు ఏలిన సైన్యాధిపతి మెగాస్టార్ చిరంజీవి గారు. బేసిగ్గా హీరోలకి ఫ్యాన్స్ వుంటారు. కానీ హీరోలే చిరంజీవి గారికి ఫ్యాన్స్ గా వుంటారు. కోట్లమంది అభిమానులకు సారధి మెగాస్టార్. క్షమించడం ఆయన గొప్ప గుణం. తనపై అనవసరమైన విమర్శలు చేసినవారిని క్షమించారు. శత్రువుని సైతం క్షమించం ఆయన నైజం. రామ్ చరణ్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకున్నది సాధిస్తారు. అలాగే నాగబాబు గారి వలన కూడా మాలాంటి ఎంతో మంది టీవీ రంగంలో ఎదిగారు. నలుగురికి మంచి చేయాలని తపించే కుటుంబం వారిది. వాల్తేరు వీరయ్యలో అన్ని ఎలిమెంట్స్ తో పాటు బ్రదర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యిందో భోళా శంకర్ లో కూడా సిస్టర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది. ఇందులో చిరంజీవి గారి వన్ మ్యాన్ షో చూస్తారు. మెగాస్టార్ చిరంజీవి గారు చూడని విజయాలు లేవు. భోళా శంకర్ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ గారికి నిర్మాత అనిల్ సుంకర గారికి మంచి విజయాన్ని చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. అభిమానులని అలరించడానికి అన్నయ్య ఎన్నో రిస్కలు తీసుకొని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చేశారు. కెమెరామెన్ డడ్లీ గారు అన్నయ్యని యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా చూపించారు. సినిమా పరిశ్రమలో అందరిని ఆప్యాయంగా పలకరించే దర్శకుడు మెహర్ రమేష్ గారు. ఈ చిత్రంలో అన్నయ్యని కొత్తగా చూపించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. అన్నయ్య బాడీ లాంగ్వేజ్ వాల్తేరువీరయ్యలో కొత్తగా చూశాం. దానికి పదింతలు భోళా శంకర్ లో ఉండబోతుంది. నిర్మాత అనిల్ గారికి ధన్యవాదాలు. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సినిమా అనేది అన్నయ్య అణువణువునా జీర్ణించుకుపోయింది. ఇన్ని సినిమాలు చేసినా మొదటి సినిమా చేస్తున్న ఉత్సాహం ఆయనలో కనిపిస్తుంది. అలాంటి మహానుభావుడితో పని చేయడం చాలా ఆనందంగా వుంది’’ అన్నారు.
డీవోపీ డడ్లీ, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, రాహుల్ సిప్లిగంజ్, సురేఖవాణి, రాజారవీంద్ర, ఆనీ మాస్టర్, వేణు, సింగర్ మంగ్లీ, లోబో తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.