జైలర్ వీర విహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాత రికార్డులను వెతికి మరీ వాటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రతీ ఏరియాలో జైలర్ విద్వంసం కొనసాగుతూనే ఉంది. ఇక తలైవా దాదాపు పుష్కర కాలం తర్వాత హిట్టు కొట్టాడు. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. విక్రమ్, పొన్నియన్ సెల్వన్ వంటి ఇండస్టీ హిట్ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్ మార్కెట్ ఉన్న తెలుగులోనూ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. నిజానికి రజనీ సినిమాలు గతకొంత కాలంగా తెలుగులో కనీసం పబ్లిసిటీ ఖర్చులు ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోతున్నాయి. కానీ జైలర్ మాత్రం ఊహించని రేంజ్‌లో దూసుకుపోతుంది. తాజాగా తెలుగులో రజనీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన తొలి డబ్బింగ్ సినిమాగా జైలర్ రికార్డులకెక్కింది. మాములుగా ఒక సినిమా బిజినెస్ ఆ ఫలానా హీరో గత సినిమా కలెక్షన్‌లను బట్టి జరుగుతుంది. అదే విధంగా జైలర్ సినిమా తెలుగు బిజినెస్ కూడా గత సినిమా వసూళ్లను బట్టి బిజినెస్ జరుపుకుంది. రజనీ చివరి సినిమా పెద్దన్న తెలుగులో అల్టా డిజాస్టర్. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. దాంతో జైలర్ సినిమాకు అంత క్రేజ్ ఉన్నా.. తెలుగులో మాత్రం రూ.12 కోట్లకు బిజినెస్ లెక్కలను క్లోజ్ చేసుకుంది.
ఏషియన్ సునీల్ నారంగ్‌తో కలిసి దిల్‌రాజు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసింది. ఇక మూడో రోజు నుంచి లాభాల బాట పట్టింది. ఎన్ని లెక్కలు వేసుకున్న మహా అయితే ఈ సినిమా పది కొట్ల లాభాలు తెస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని రేంజ్‌లో ఈ సినిమాకు రెస్పాన్స్ రావడం.. పోటీగా వచ్చిన భోళా దిబేల్‌మని పడిపోవడంతో ఈ సినిమా కలెక్షన్‌లకు రెక్కలొచ్చాయి.
రోజు రోజుకు కలెక్షన్‌ల సంఖ్యతో పాటు టిక్కెట్‌లు కూడా భారీ రేంజ్‌లో తెగుతూ వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగులో ఈ సినిమా రూ.42 కోట్లకు పైగా షేర్‌ను రూ.80 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. అంటే బయ్యర్లు ఈ సినిమా రూ.30 కోట్ల ప్రాఫిట్స్‌ను అందించింది. ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమా కూడా ఈ రేంజ్‌లో ప్రాఫిట్స్ తీసుకురాలేదని డిస్టిబ్యూట్రర్లే తీర్మానించేశారు. పన్నెండు రోజుల పాటు వరుసగా కోటికి పైగా షేర్ సాధించి తెలుగు బాక్సాఫీస్‌పై అద్భుతాలు సృష్టించింది.