AP: జగన్ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు… క్షమిస్తున్నాను అంటూ?

AP: ఏపీలో కూటమి పార్టీలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది అయితే జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలోకి వెళ్లాల్సి ఉంటుంది తప్ప ఆయనకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాత్రం ఉండదు. ఇలా ప్రజల తరపున ప్రతిపక్ష నేత హోదాలో వెళ్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తమకంటూ కొంత సమయం ఉంటుందని అందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుందంటూ స్పీకర్ కు లేఖ రాశారు అలాగే కోర్టును కూడా ఆశ్రయించారు.

ఇక ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా వద్దా అనే విషయంపై కోర్ట్ ఎలాంటి తీర్పు వెల్లడించలేదు. అయితే తాజాగా మరోసారి జగన్ ప్రతిపక్ష నేత హోదా గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరిగిందని.. ఇవన్నీ తెలిసి కూడా జగన్‌ చేసిన వ్యాఖ్యలను క్షమించి వదిలేస్తున్నాను అంటూ స్పీకర్ జగన్ తీరుపై విమర్శలు కురిపించారు.

నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలి అంటే 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేతగా హోదా వస్తుందని ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తించాలి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము అంటూ జగన్ కూడా భీష్మించుకొని కూర్చున్న విషయం మనకు తెలిసిందే.