టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొద్ది రోజుల క్రితం ఛాతి నొప్పితో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. అతని గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికట్లు ఉన్నట్లు వైద్యులు తేల్చగా, యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు. అయితే రెండు రోజులుగా అతను డిశ్చార్జ్ అవుతాడని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లు మిగిలిపోయాయి. కొద్ది సేపటి క్రితం సౌరవ్‌ని డిశ్చార్జ్ చేశారు. తనకు వైద్యం అందించిన డాక్టర్స్‌కు దాదా కృతజ్ఞతలు తెలిపారు. అలానే తాను క్షేమంగానే ఉన్నట్టు తన అభిమానులకి తెలియజేశాడు.
యాంజియోప్లాస్టీ తర్వాత సౌరవ్ గంగూలీ యాక్టీవ్‌గా ఉన్నాడని చెప్పుకొస్తున్న వుడ్‌ల్యాండ్స్ వైద్యులు ఇంటి వద్ద నుండే ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారు. అయితే జనవరి 2న ఛాతి నొప్పితో గంగూలి ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో అభిమానులలో భయాందోళనలు నెలకొన్నాయి. రాజకీయ ఒత్తిడి వలననే అతనికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. గంగూలీ ఆసుపత్రిలో ఉన్న సమయంలో కోల్‌కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖులు ఆయనని సందర్శించారు. ఆయన ఆరోగ్యంకు సంబంధించి ఆరాలు తీసారు.