జగన్మోహన్ రెడ్డి కేంద్ర స్థాయిలో బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు కానీ బీజేపీ మాత్రం జగన్ కోసం ఏమి చెయ్యలేకపోతుంది. కనీసం ఆయన మీద ఉన్న కేసుల విషయంలో కూడా బీజేపీ పెద్దలు జగన్ కు భరోసా ఇవ్వడం లేదు, అలాగే రాజకీయంగా కూడా జగన్ ను దెబ్బతియ్యడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి బీజేపీపై యుద్ధానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తరువాత ఓదార్పుయాత్ర చేస్తానంటే కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోలేదని, ఆయన పోరాడి సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు ఢిల్లీ అహంకారానికి కడప పౌరుషానికి పోరాటం అన్నారు. అలాగే ఇప్పుడు బీజేపీపై కూడా పోరాటానికి వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. ఇప్పటికే బీజేపీ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఓపిక పట్టారని, ఇక పోరాటానికి సిద్ధమయ్యాడాని వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు.
తాజాగా రాష్ట్రానికి ఆర్థికంగా నట్లు బిగించే ప్రయత్నాలు బీజేపీ నాయకులు చేస్తున్నారన్న అనుమానాలు..జగన్మోహన్ రెడ్డి సర్కార్‌లో ప్రారంభమయ్యాయి. అలాగే పోలవరం విషయంలో ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేసేందుకు బీజేపీ వ్యూహం పన్నిందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. తాము మద్దతు ఇస్తున్నప్పటికి తమనే దెబ్బతియ్యడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, అలాగే రాష్ట్రాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టుతున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు.
కేంద్రంలో తిరుగులేని ప్రభుత్వం ఉంది. సొంత పార్టీ నేతలైనా..ఇతరులైనా ప్రశ్నించే సాహసం చేయలేనంత బలమైన ప్రభుత్వం ఉంది. అందుకే.. అనేకానేక రాజకీయ పార్టీలు సైలెంట్‌గా ఉంటున్నాయి. ఇలాంటి సందర్భంలో వైసీపీ బీజేపీకి ఎదురు తిరిగితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.