అమరావతి భూక్రమాల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుటున్నాయి. అమరావతిలో జరిగిన భూ అక్రమాలను బయటపెట్టడానికి వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలుస్తుంది. భుఅక్రమాల గురించి విచారించడానికి సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటిలాగే హై కోర్ట్ నుండి ఎదురు దెబ్బ తగిలింది. అమరావతిలో జరిగిన భుఅక్రమాల జరిగాయని భావించి, సిట్ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు ఆపేయాలని హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు అమరావతి భుఅక్రమాలపై మరో ఆయుధాన్ని ఉపయోగించనున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బాబును ఇరకాటంలో పెట్టనున్న జగన్
రాజధానిపై పేరుతో అమరావతిలో గత ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ అక్రమాలను బయటపెట్టడానికి కీలక అస్త్రాన్ని ఉపయోగించనున్నారని సమాచారం. సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 25న జరగనున్న ఏపీ కేబినెట్ భేటిలో భుఅక్రమాలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అమరావతి భూముల కుంభకోణం దర్యాప్తు వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తరువాత ఏం చేయాలనే దానిపై కేబినెట్ చర్చించనుంది. సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడంతో సీబీఐకి ఈ కేసు అప్పగించాలని కేబినెట్ తీర్మానించే అవకాశం ఉంది.
సీబీఐని బాబు తట్టుకోగలడా!
ఒకవేళ అమరావతిలో జరిగిన భుఅక్రమాల గురించి సీబీఐ విచారణకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా అని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఎందుకంటే అమరావతిలో భూములు కొన్నవారి వివరాలు చేస్తూ అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఎవరికైనా అర్ధమవుతుంది. కాబట్టి సీబీఐ విచారణలో టీడీపీ నాయకులు చేసిన మోసాలు ఖచ్చితంగా బయటపడుతాయని వైసీపీ నాయకులు చెప్తున్నారు. సిటీ విచారణనే ఆపేయాలని చంద్రబాబు కోరుతున్న తరుణంలో సీబీఐతో టీడీపీ నేతలకు కొత్త చిక్కులు రానున్నాయి.