వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నేతల్లో నగరి ఎమ్మెల్యే రోజా ఒకరు. ఆమె వైసీపీలో చాలా కీలకనేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ రోజా వైసీపీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వచ్చింది. టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన రోజా చాలా తక్కువ రోజుల్లోనే జగన్ కు రైట్ హ్యాండ్ గా ఎదిగారు. గతంలో వైసీపీ కోసం పోరాడుతూ ఒక సంవత్సరం పాటు అసెంబ్లీ నుండి కూడా నిషేదించబడ్డారు. జగన్ కూడా రోజాకు పార్టీలో కీలక స్థానం కలిపించేవారు కానీ ఈ మధ్య కాలంలో జగన్ రోజాకు పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
జగన్ కావాలనే రోజాకు పట్టించుకోవడం లేదా!!
చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రధాన నేతల మధ్య జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కన్పించడం లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాల మధ్య పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విభేదాలు తలెత్తాయి. రోజా మొదట మంత్రి పదవిని ఆశించారు. అయితే కులాల సమీకరణలో ఆమెకు మంత్రి పదవి ఆమెకు కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి వెళ్ళింది. అలాగే తన నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వేలు పెడుతున్నారన్నది ఎమ్మెల్యే రోజా ప్రధాన ఆరోపణ. ఈ విషయాల పట్ల రోజా చాలా బాధలు పడుతుంది కానీ జగన్ మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదు. జగన్ పట్టించుకోకపోవడానికి కారణాలు తెలియకపోయిన్నప్పటికి రోజాకు మాత్రం గతంలో ఉన్నంత గుర్తింపు మాత్రం ఇప్పుడు వైసీపీలో లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. తన కుడి భుజంగా ఉన్న రోజాకు జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదోనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
రోజా విశ్వరూపం జగన్ చూస్తారా!!
రోజా వైసీపీని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవ్వరు ఏమన్నా అస్సలు ఊరుకోరు అలాంటిది ఇప్పుడు తన నియోజకవర్గంలో తనకే అన్యాయం జరుగుతుంటే మాత్రం ఎందుకు మౌనంగా ఉందొ వైసీపీ నాయకులకు కూడా అర్ధం కావడం లేదు. తాజాగా ఈడిగ కార్పొరేషన్ పదవి కూడా తన ప్రత్యర్థి అయిన కేజే శాంతిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కుడి రోజా చాలా అసహనానికి గురి అవుతున్నారు.ఇలాంటి తరుణంలో ఎదో ఒకరోజు రోజా జగన్ పై కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.