వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఆర్థిక సమస్య ప్రధానమైనది. ఇప్పటికే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. గత ప్రభుత్వం రూ. 30 వేలకోట్ల అప్పును మిగిల్చగా, వైసీపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే దాదాపు 70 వేలకోట్ల అప్పులు చేసినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇలా విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఉచిత పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్నారు. అయితే ఇలా పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికి ఇప్పటి వరకు వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీ ఒక్కటి కూడా లేదు.
జగన్ మొదటి విజయం
ఈజీ ఆఫ్ డూయింగ్ బిసినెస్ లో మొదటి స్థానంలో ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. రూ. 20 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్, అపాచీ కంపెనీలు తమ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఇవే కాకుండా పర్యావరణ రహిత, ఎలక్ట్రిక్ పరిశ్రమల ఏర్పాటుకు తైవాన్ కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు కూడా మంత్రి చెప్పారు. ఇక అదాని అయితే రూ. 15 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. 130 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే సెంటర్ లో సుమారు 25 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అదాని, అపాచి లాంటి కంపెనీల ఇక అదాని అయితే రూ. 15 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది.
పెరగనున్న ఉపాధి అవకాశాలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి వికేంద్రీకరణ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆలాగే ఇప్పుడు ఈ కంపెనీలను కూడా ఒకే చోట పెట్టకుండా వల్ల అవసరాలను బట్టి అన్ని ప్రాంతాల్లో పెట్టేలా ఏర్పాట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఆదాని 130 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే సెంటర్ లో సుమారు 25 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అదాని, అపాచి లాంటి కంపెనీల ద్వారా తొందరలోనే 40 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఏదేమైనా రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి మెల్లిగా అయినా పెట్టుబడులు పెట్టటానికి స్వదేశీ, విదేశీ పరిశ్రమలు రావటం శుభపరిణామమనే చెప్పాలి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి ఇలాంటి పెట్టుబడులు ఉపయోగపడతాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.