వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా కీలకమైన విషయాల్లో వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అన్ని కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే మూడు రాజధానుల విషయం కోర్ట్ ల చుట్టూ తిరుగుతుంది. ఏపీ ప్రజలకు రాజధాని విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే వైసీపీ నాయకులు మాత్రం వచ్చే ఉగాదిలోపు రాజధాని అమరావతి నుండి విశాఖకు షిఫ్ట్ చేయనున్నారని హింట్స్ ఇస్తున్నారు.
విచారణ ఆలస్యం కానుందా!!
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల బిల్లుల మీద విచారణ రోజు వారీ పద్ధతిలో సాగుతోంది. అయితే ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి మహేశ్వరి బదిలీ మీద వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కొత్త ప్రధాన న్యాయమూర్తి గోస్వామి నియమితులయ్యారు. ఆయన ఈ కేసుని విచారించాల్సి ఉంది. మరి మొదటి నుంచి ఈ కేసు పూర్వపరాలు తెలుసుకుని విచారిస్తే మరింతగా లేటు అవుతుంది అంటున్నారు. అలా కాకుండా ఈ కేసును ఇప్పటిదాకా విచారించిన దానినే కంటిన్యూ చేస్తే మాత్రం మరో మూడు నెలలకు తీర్పు రావచ్చు అంటున్నారు.
రాజకీయాలు మారనున్నాయా!!
ఏపీ రాజకీయాలు ఇపుడు మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతి రాజధానిగా కనుక తీర్పు వస్తే రాజకీయం ఒకలా ఉంటుంది. అది చంద్రబాబుకు అనుకూలంగా మారి తెలుగుదేశం పార్టీ బలంగా పుంజుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదే మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు వస్తే జగన్ కి ఇక తిరుగు ఉండదు. అపుడు చంద్రబాబుకు రాజకీయ వనవాసం మరింతకాలం కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఏపీ ప్రజలకు కూడా రాజధాని మీద ఏదో ఒక తీర్పు వస్తే క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది.