తనకి గుడి కట్టించినందుకు సోనూ సూద్ షాకింగ్ రియాక్షన్.!

భారతదేశం వ్యాప్తంగా కూడా నటుడు సోనూ సూద్ పేరు తన సినిమాల వల్ల ఎంతవరకు తెలిసిందో కానీ తాను గత రెండేళ్లుగా కరోనా సమయంలో అందించిన సహాయాలతో మాత్రం భారతదేశ ప్రజలలో ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. లేదు అనకుండా ఎంతోమంది పట్ల ఆపద్భాందవుడు గా నిలిచిన సోనూ సూద్ సాయం అందుకున్న వారు ఏకంగా గుడి కూడా కట్టించేసారు.

గత కొన్ని నెలల కితమే తెలంగాణాలో సోనూ సూద్ కి ఓ గ్రామంలో గుడి కట్టించగా ఇప్పుడు మళ్ళీ ఇదే తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో సోనూ సూద్ కి ఇంకో గుడి వెలసింది. అక్కడి గ్రామ ప్రజలు పూజలు కూడా చేస్తున్నారు. దీనితో ఈ వీడియో వైరల్ అవుతుండగా దానికి సోనూ సూద్ ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ కూడా ఆసక్తిగా ఉంది. “నాకు ఇలాంటివి అవసరం లేదు, కానీ మీరు అంతా చూపిస్తున్న ఈ ఎనలేని ప్రేమ పట్ల మాత్రం విధేయుడిగా ఉంటాను” అని సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు.