సోను సూద్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఈయన నిజ జీవితంలో మాత్రం హీరో అని చెప్పాలి. కరోనా సమయంలో ఎంతోమందికి నేనున్నాను అంటూ సహాయం చేసి అందరి దృష్టిలో దేవుడిగా స్థానం సంపాదించుకున్నారు. కేవలం కరోనా సమయంలో మాత్రమే కాకుండా ఇప్పటికీ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఈయన తన మంచి మనసు చాటుకున్నారు. ఇకపోతే కరోనా సమయంలో సోనుసూద్ సాయం అందుకున్న ఎంతో మంది ఇప్పుడు తమ సొంత కాళ్లపై నిలబడగలిగారు.
ఈ విధంగా సోనుసూద్ నుంచి ఆర్థిక సహాయం అందుకున్న ఎంతో మంది సొంత వ్యాపారాలను ప్రారంభించి ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇక కొంతమంది అయితే సోనుసూద్ పేరుపై పెద్దఎత్తున వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.తాజాగా తూర్పు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులను సోనూసూద్ ఏర్పాటు చేయడంతో ఆ వ్యక్తి ఏకంగా తన ఫుడ్ స్టాల్ సోను సూద్ పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం అతను వ్యాపారం ఎంతో అద్భుతంగా జరగడంతో ఆయన తన కాళ్లపై తన నిలబడ్డారు.
ఈ క్రమంలోనే సోను సూద్ పేరిట ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడంతో ఆరాధన రాథోడ్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫుడ్ స్టాల్ ఆరు నెలల క్రితం అపార్ట్మెంట్ దగ్గర ఏర్పాటు చేశారని అయితే ప్రస్తుతం ఫుడ్ స్టాల్ కు మంచి ఆదరణ లభిస్తోందని, కేవలం సోనూసూద్ సహాయంతో ఈ వ్యక్తి తన కాళ్ళపై తాను నిలబడ్డారని ట్విట్టర్ వేదికగా ఈ వీడియోని షేర్ చేస్తూ తెలియజేశారు. ఇక ఈ వీడియో పై స్పందించిన ఫుడ్ స్టాల్ ఓనర్ కి చిన్న రిక్వెస్ట్ చేశారు. తనకు ఒక ప్లేట్ నాన్ ఇవ్వాలని సోదరుడికి చెప్పండి అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే సోనుసూద్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.