సోనూసూద్ దాతృత్వం …15 నెలల చిన్నారి గుండె ఆపరేషన్ కి రూ. 4.50 లక్షల సాయం !

sonusood honoured with his statue at durga mandal in kolkata

సోనూసూద్ .. కరోనా సమయంలో ప్రజల గురించి అలోచించి, వారికి మద్దతుగా నిలిచిన వ్యక్తి. కోట్లాది రూపాయలని ప్రజల బాగోగుల కోసం ఖర్చు పెట్టాడు. అన్నా ఆపదలో ఉన్నాం రక్షించు అంటే .. నేనున్నా అంటూ అభయం అందించారు. కరోనా తక్కువ అవుతున్నా కూడా సోనుసూద్ మాత్రం తన సేవా గుణాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.

Sonu Sood honoured by UNDP with special humanitarian action award

తాజాగా సోనూసూద్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నాడు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 15 నెలల వయసున్న చిన్నారి ఆపరేషన్‌కు అవసరమైన రూ. 4.50 లక్షల ఆసుపత్రి బిల్లు చెల్లించాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతుల కుమార్తె వర్షిత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. పాపను బతికించుకోవాలంటే ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులు చెప్పారు.

పేద కుటుంబం కావడంతో ఆపరేషన్‌కు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడం వారికి తలకుమించిన భారంగా మారింది. దీంతో జనవిజ్ఞాన వేదిక ప్రతినిధుల ద్వారా చిన్నారి పరిస్థితిని నటుడు సోనూ సూద్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ముంబై ఆసుపత్రిలో చిన్నారి ఆపరేషన్‌ కు అవసరమైన రూ. 4.50 లక్షల సాయం అందించాడు. చికిత్స అనంతరం చిన్నారి కోలుకోవడంతో వెంకటేశ్వర్లు దంపతులు సోమవారం స్వగ్రామానికి చేరుకున్నారు. తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టారంటూ ఈ సందర్భంగా సోనూ సూద్ ‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.