లేడీ కే‌జి‌ఎఫ్ లా రంగంలోకి దిగిన సోనియా.. వాళ్లందరినీ రాత్రికి రాత్రి తన్ని తరిమేయబోతున్నారు?

Sonia Gandhi fires on congress senior leaders

గత కొన్ని రోజులుగా జాతీయ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు తిట్టుకుంటున్న సంగతి తెలిసిందే. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల పార్టీకి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తోంది. పార్టీకి ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో కూడా తేల్చుకోలేకపోతున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీ అయి ఉండి.. దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన పార్టీ అయి ఉండి ఇలా వ్యవహరించడం పార్టీకి తీవ్ర నష్టం.

Sonia Gandhi fires on congress senior leaders

అందుకే బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటుంటే మధ్యలో మనమెందుకులే అని ఊరుకుంటోంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ పరువును కాంగ్రెస్ పార్టీ నాయకులే తీసేస్తున్నారు. రోజురోజుకూ పార్టీ ప్రతిష్ట దిగజారిపోతోంది.

ఇలా అయితే ఇక కష్టం. పార్టీని గాడిలో పెట్టాల్సిందే. లేదంటే పార్టీ నామరూపాలు లేకుండా కొట్టుకుపోతుంది.. అని అనుకున్నారో ఏమో.. ఏకంగా సోనియా గాంధీ ఇక రంగంలోకి దిగారట. ఇప్పటికే 23 మంది సీనియర్ నాయకులు అసమ్మతితో లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించాలంటూ లేఖలు రాశారు.

పార్టీపై ఎప్పటి నుంచో అసమ్మతితో ఉన్నారో వాళ్లను సోనియా గాంధీ టార్గెట్ చేసుకున్నారు. వాళ్లపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సీనియర్ నాయకులు ఎవరైతే అసమ్మతితో ఉన్నారో.. వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ హైకమాండ్ ను ఇతర నేతలు ఫిర్యాదు చేసే విధంగా సోనియా గాంధీ చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

అలా విమర్శలు ఎదుర్కున్న వారిలో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్, శశి థరూర్ ఉన్నారు. మరోవైపు ఎంతో అనుభవం ఉన్న నేతలను కాదని… తనకు ఎంతో నమ్మకస్తుడు అయిన జైరాం రమేశ్ ను సోనియా గాంధీ రాజ్యసభలో చీఫ్ విప్ గా నియమించారు. ఇది సీనియర్ నేతల్లో ఇంకాస్త అసంతృప్తిని రగిలించింది.

అలాగే.. పార్టీ తరుపున కీలక నిర్ణయాలు తీసుకునేలా కమిటీని నియమించిన సోనియా.. దానికి అర్హులైన వారిని కాకుండా.. తనకు నచ్చిన వారికి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు నాంది పలికింది. ఇలా.. ప్రతి దాంట్లో అర్హులైన వారిని కాకుండా.. వేరే వాళ్లను నియమిస్తూ.. అసమ్మతి నేతలకు గట్టిగానే బదులు చెబుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ.. ఇది రేపు కాంగ్రెస్ పార్టీ పతనానికే దారి తీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఇలా ప్రతి కమిటీలో ప్రక్షాళన చేపట్టడం బాగానే ఉన్నది కానీ.. అది పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని.. అలాగే సీనియర్ నేతల నుంచి ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది.