Crime న్యూస్: దేశంలో మరణాల రేటు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఆత్మహత్యలు హత్యలు రోడ్డు ప్రమాదాలు ఇలా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు వందల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాలలో వ్యక్తులు మూర్ఖంగా ఆలోచించి ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు సైతం ఎంతో తెలివిగా నడుచుకుంటూ నుండి కొందరు వ్యక్తులు మాత్రం మూర్ఖంగా ఆలోచిస్తే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ సిద్దిపేట జిల్లా లో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. తల్లి గుడ్డు కూర ఉండలేదని మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాలలోకి వెళితే…సిద్దిపేట జిల్లా మనోహరాబాద్ గ్రామానికి చెందిన మస్కూరి నర్సింలు, సుశీల దంపతులకు ఇద్దరు కొడుకులు. నరసింహులు చిన్న కుమారుడు మాములేశ్ జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలలో ఉంటూ పనులు చేసేవాడు. కరోనా సమయంలో పనుల్లేక మామూలేశ్ స్వగ్రామానికి తిరిగివచ్చి తల్లిదండ్రులతో కలిసి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మములేశ్ చేయి విరగడంతో ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి మల్లేష్ కోడిగుడ్డు కూర వండమని తల్లిని అడిగాడు. ఇంట్లో గుడ్లు కూర వండటానికి గుడ్లు లేవని చెప్పటంతో మములేష్ కోపంతో తల్లి నీ అరిచాడు. ఇలా ఇద్దరి మధ్య కొంతసేపు గొడవ జరిగింది. తర్వాత మములేష్ ఇంటి నుండి బయటకి వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. కొడుకు కోసం చుట్టుపక్కల మొత్తం గాలించినా ఆచూకీ లభించలేదు. మరునాడు ఉదయం గ్రామ సమీపంలోని మహంకాళి ఆలయం వద్ద చెట్టుకు కరెంటు తీగతో ఉరి వేసుకొని కనిపించాడు. చేతికి అందిన కొడుకు ఇలా గుడ్డు కూర వండలేదని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నరసిమ్ములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.