రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ జెండాను పాతడానికి బీజేపీ నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం బీజేపీ నాయకులు మాటలతో హడావిడి తప్ప చేతల్లో మాత్రం ఏమి చెయ్యలేకపోతున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకులు ఏపీలో ప్రజల నుండి చాలా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అలాగే వాళ్ళు చేస్తున్న, చేసిన మోసాన్ని ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అయితే ఇప్పుడు సోము వీర్రాజు చేసిన తప్పుతో బీజేపీ నాయకులు సతమతమవుతున్నారు.
బెడిసి కొట్టిన మైండ్ గేమ్స్
బీజేపీ నాయకులు ఏపీ తమ బలాన్ని పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, టీడీపీలో ఉన్న నాయకులను తమ పార్టీలోకి తీసుకోవడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ నాయకులు ఒక మైండ్ గేమ్ రచించారు. అదేంటంటే టీడీపీ నాయకులు అయిన కళా వెంకట్రావ్ ను, అరుణను కలుస్తున్నట్టు ప్రెస్ నోట్ ల ద్వారా హడావిడి చేశారు. అయితే ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే కళా వెంకట్రావ్, అరుణ మీడియా ముందుకు వచ్చి తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, ఎప్పటికి టీడీపీలోనే ఉంటామని చెప్పారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసి టీడీపీ నేతల్లో ఆందోళన కలిగించి తమ పార్టీలోకి లాక్కోవడానికి సిద్ధమయ్యారు. అయితే టీడీపీ నాయకులు మీడియా ముందుకు రావడంతో బీజేపీ నాయకుల మైండ్ గేమ్ బెడిసి కొట్టింది.
బలపడే ఆలోచన లేదా!!
బీజేపీ నాయకులు ఏపీలో కూడా తమ బలాన్ని చాటుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ వాళ్ళు ముందుకు వెళ్తున్న విధానం మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బీజేపీ నాయకులు తాము బలపడటానికి కంటే కూడా ఎక్కువగా వేరే పార్టీ నేతలను పార్టీలోకి తీసుకొని తొందరగా ఎదగాలని ఆశ పడుతున్నారు. పైగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ఖండించకుండా కేవలం టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఏపీ ప్రజలు బీజేపీని, బీజేపీ నాయకులను నమ్మడం లేదు. పైగా ఇప్పుడు సోము వీర్రాజు చేసిన తప్పు వల్ల ఏపీలో బీజేపీ నాయకులు పరువు ఇంకాస్త పోయింది. బీజేపీ నాయకులు భవిష్యత్ లో కూడా ఇలానే వ్యవహరిస్తే ఏపీలో బలపడటం చాలా కష్టం.