బీజేపీ నూతన సారథి సోము వీర్రాజు వ్యూహత్మకంగా ముందుకు కదులుతున్నారా? పార్టీ బలోపేతం కోసం అధ్యక్షుడి హోదాలో తీసుకుంటోన్న నిర్ణయాలన్నీ ఆచరణ..ఆమోదయోగ్యంగానే ఉంటున్నాయా? అంటే అవుననే అంటోంది బీజేపీ మెజార్టీ వర్గం. పాత సారథి కన్నా లక్ష్మీనారయణ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత సోము వీర్రాజు గద్దెనెక్కిన తర్వాత చోటు చేసుకుంటోన్న పరిణామాలు..జరుగుతోన్న మార్పులు చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. సోము వీర్రాజు రావడం రాడమే దూకుడుగా వచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోక ముందే మీడియా ఇంటర్వ్యూలతో వాతావరణాన్ని వేడెక్కించారు.
తన ఐడెంటిటీని చాటే ప్రయత్నం చేసారు. అటుపై మెగాస్టార్ చిరంజీవితో రాజకీయ భేటి..అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీలు వరుసగా సీన్ ని మరింత వేడెక్కించాయి. ఇంతలో మాజీ కాపు ఉద్యమనాయుడు ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దించుతున్నట్లు..బీజేపీ ఆఫర్లతో ఆయన్ని లాక్ చేసే ప్రయత్నాలు చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది. తాజాగా సోము వీర్రాజు పార్టీ బలోపేతం కోసం కీలక అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ఏపీలో బలమైన ఓటు బ్యాంక్ గా ఉన్న బీసీలను..కాపుల్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
బీసీ ఓటు బ్యాంక్ ను ఆకర్షించేలా బీజేపీ టార్గెట్ చేయగా..కాపు సామాజిక ఓట్లను ఆకర్షించే బాధ్యతని పవన్ కళ్యాణ్ కి అప్పగించి నట్లు ప్రచారం సాగుతోంది. ఈ రెండు అంశాలకు సంబంధించి భారీ పొలిటికల్ యాక్షన్ టీమ్ నే రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ ని పక్కకు నెట్టి ఆస్థానంలో బీజేపీ కబ్జా చేయాలని చూస్తున్నట్లు ఆ పార్టీ నేతల బహిరంగ వ్యాఖ్యల్ని బట్టే తేలిపోయింది. ఇక వైసీపీ పై బీజేపీ డైరెక్ట్ గా ఎటాక్ చేయకుండా చీకటి ఒప్పందాలతో ముందుకు కదులుతోంది. ఇలా కొత్త సారథి ఆధ్వర్యంలో మిగతా నేతలు సంతృప్తిగానే ఉన్నట్లు తెలిసింది.