జగన్ ని పక్కన పెట్టి మరీ చంద్రబాబు మీద మండిపడుతున్న సోము .. మోడీ స్కెచ్ ఇదేనా ?

somu veerraju

 ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాజకీయాలు చూస్తే ఎవరికైనా సరే పిచ్చెక్కిపోవటం ఖాయం. ఆ పార్టీలోనే ఎప్పుడు రెండు వర్గాలు ఉంటాయి, ఒకటి చంద్రబాబు నాయుడును విమర్శించే వర్గం, మరొకటి చంద్రబాబు నాయుడును సమర్ధించే వర్గం, అవసరానికి తగ్గట్లు ఆ రెండు వర్గాలు తమ తమ బాధ్యతలను బీజేపీ అగ్రనాయకత్వ ఆదేశాల మేరకు మార్చిమార్చి నిర్వహిస్తుంటాయి. ఇప్పడు ఆంధ్రాలో చంద్రబాబు వ్యతిరేక వర్గం బీజేపీ లో కీలకంగా వ్యవహరిస్తోంది.

somu veerraju

 కన్నా లక్ష్మి నారాయణ స్థానంలో సోము వీర్రాజు అధ్యక్షుడు అయినా దగ్గర నుండి టీడీపీని, చంద్రబాబు నాయుడును విమర్శించటమే పనిగా పెట్టుకున్నాడు, ఆ విమర్శలు కూడా పాత చింతకాయ పచ్చడి మాదిరి ఉంటున్నాయి, మామకు వెన్నుపోటు పొడిశావు, టీడీపీ పార్టీని కబ్జా చేశావు లాంటి మాటలు చేస్తూ, రాజకీయం చేస్తుంది. అసలు ప్రతిపక్షములో ఉన్న పార్టీ అధికార పక్షాన్ని టార్గెర్ చేస్తూ, విమర్శలు చేయాలి కానీ, మరో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. బహుశా ఇది మోడీ స్కెచ్ అనుకోవాలేమో..?

 అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటనే బీజేపీ ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ మీద విమర్శలు చేస్తే స్థితిలో లేదు ఎందుకంటే.. జ‌గ‌న్‌ను విమ‌ర్శించాల్సి వ‌స్తే.. ప్ర‌ధానంగా మూడు రాజ‌ధానుల విష‌యాన్ని త‌ల‌తిక్క నిర్ణ‌యంగా పేర్కొనాలి. అదే స‌మ‌యంలో పోల‌వ‌రం క‌ట్టలేక పోతున్నాడు.. అస‌మ‌ర్ధ పాల‌కుడు.. అనైనా విమ‌ర్శించాలి. కానీ.. ఇలాంటి విమ‌ర్శ‌లు చేసే సాహ‌సం.. ఇప్పుడు బీజేపీ చేయ‌లేదు. ఎందుకంటే.. అవి ఆగిపోవ‌డానికి.. రాజ‌ధాని నిలిచిపోవ‌డానికి ప‌రోక్షంగా బీజేపీ కార‌ణంగా ఉంది. సో..అత్యంత‌కీల‌క‌మైన‌ రాజ‌ధానిపై జ‌గ‌న్‌ను విమ‌ర్శించే ప‌రిస్థితిలేదు. ఒక‌వేళ విమ‌ర్శించినా.. మీరు నిధులు ఇవ్వ‌డం లేదు క‌నుక మేం రాజ‌ధాని క‌ట్టలేక పోతున్నామంటూ.. వైసీపీ ఎదురు దాడి చేసినా.. చేయొచ్చు.

ఇక‌, పోల‌వ‌రంపైనా బీజేపీ మౌనం వ‌హిస్తోంది. నిజానికి ఇప్పుడు పోల‌వ‌రం స‌బ్జెక్టును తీసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. బీజేపీకి మంచి మార్కులు ప‌డ‌తాయి.ఎందుకంటే.. ఇది నిలిచిపోవ‌డానికి .. ఎత్తు త‌గ్గిపోవ‌డానికి బీజేపీ స‌ర్కారే కార‌ణమ‌ని వైసీపీ నుంచి ఎదుర య్యే దాడులు.. బీజేపీని మ‌రింత ఇర‌కాటంలోకి నెట్ట‌డం ఖాయం. ఇక‌, మిగిలింది.. దేవాల‌యాల‌పై దాడు లు. దీనినే ప‌ట్టుకుని వేలాడుతున్నా.. ఇది కూడా ప్ర‌జ‌లు పెద్ద‌గా రిసీవ్ చేసుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీనితో వైసీపీ మీద ఎటు నుండి విమర్శలు చేసే అవకాశం లేకపోవటం, ఒక వేళా విమర్శలు చేసిన అవి మళ్ళీ బీజేపీ మెడకే చుట్టుకునే అవకాశం ఉండటంతో వైసీపీని వదిలేసి, టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ రాజకీయాలు చేస్తుంది.