RC15 : చరణ్, శంకర్ సినిమాకి అక్కడ రికార్డు బిజినెస్.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా మార్కెట్ లో మంచి సెన్సేషన్ రేపే కాంబినేషన్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం ఇద్దరి కెరీర్ లో కూడా 15వ సినిమా కావడం మరో విశేషం.

అయితే ఇక ఈ సినిమా పై అనేక అంచనాలు ఇప్పుడు నెలకొనగా ఈ సినిమా ఓవర్సీస్ లో భారీ బిజినెస్ ని జరుపుతున్నట్టుగా సినీ వర్గాల్లో తెలుస్తుంది అయితే ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ గాను యూఎస్ మార్కెట్ మరియు కెనడా లో హక్కులు కలిపి ఏకంగా 17 కోట్లు డీల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో ఇది చరణ్ కెరీర్ లోనే నాన్ RRR రికార్డు అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏ లెవెల్లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అంజలి కూడా మరో హీరోయిన్ గా సినిమాలో నటిస్తుండగా దిల్ రాజు తన బ్యానర్ లో 50వ సినిమాగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.