తెలుగు రాజకీయాల్లో బీజేపీ కొత్త చరిత్రను సృష్టించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో స్థిరపడిన బీజేపీ ఏపీలో బలపడటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే బీజేపీ సొంతంగా తానా బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న నేతలను పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధమైంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల చాలామంది నేతలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. అయితే బీజేపీ చేరికల వల్ల టీడీపీ, జనసేన పార్టీలు నష్టపోతున్నాయి.
బీజేపీలో చేరబోయే నాయకులు ఎవరు?
బీజేపీలోకి వస్తున్న వారిలో వైసీపీ నుంచి గతంలో జంప్ చేసి టీడీపీలో చేరిన పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, గుంటూరు నుంచి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, అనంతపురం నుంచి జేసీ బ్రదర్స్, కర్నూలు నుంచి టీజీ కుమారుడు భరత్ వంటి నేతలతో ఇప్పుడు బీజేపీ నేతలు టచ్‌లోకి వెళుతున్నారు. ఇప్పుడు మీరున్న పార్టీలో భవిష్యత్ ఉండదని వీరిపై తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకు వస్తున్నారట. ఈ నాయకులను బీజేపీలోకి తీసుకోవడానికి సోము వీర్రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాయకులందరు ఒకవేళ బీజేపీలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఇబ్బందులు పడనున్నాయి. అలాగే వైసీపీకి బీజేపీ నుండి గట్టి పోటీ ఎదురు కానుంది.
సొంతంగా బీజేపీ ఎదగలేదా!!
ఆంధ్రప్రదేశ్ లో ఎదగడానికి బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సొంతంగా ఎదగడం కంటే కూడా ఇతర పార్టీల నాయకులను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతూ బీజేపీ సొంతంగా నాయకులను తయారు చెయ్యలేదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా చెయ్యడం మాత్రం రానున్న రోజుల్లో బీజేపీకి కష్టాలు తెస్తుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.