Smoking Problem: పొగాకు వినియోగించే వారిలో ప్రతి సగం మంది అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. పొగాకు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ప్రతిఏటా 60 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా భారతదేశంలోనే 10 లక్షల మంది పైగా సిగరెట్ తాగే వారు అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. సిగరెట్ తాగడం వల్ల వచ్చే పొగను పీల్చడం వల్ల కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు .
ఈ మధ్యకాలంలో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. పూర్వం చాలా తక్కువ మందికి ఈ వ్యాధి సోకేది. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. నేటి యువతలో చాలామందికి సిగరెట్ తాగడం ఒక ట్రెండ్ గా మారింది. ఈ అలవాటు ఉన్న పెద్దలు కూడా వారి పిల్లల ముందు పొగ త్రాగటం వలన ఇది ఇంకా వ్యాప్తి చెందుతోంది అనుకోవచ్చు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ పొగ త్రాగడం వల్ల వస్తుంది అని అందరికీ తెలుసు, కానీ ఎవరు దీనికి దూరంగా ఉండరు. యువతలో చైతన్యం పెంచడానికి సినిమా థియేటర్లలో ఎన్ని ప్రకటనలు ఇచ్చినా కూడా పెద్దగా మార్పు కనిపించడం లేదు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఇది ఒక అలవాటుగా మారిపోయింది . ఇంతకు ముందు ఆడవారికి అసలు సిగరెట్ అలవాటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందరూ పాశ్చాత్య సంస్కృతి అలవాటుపడి అమ్మాయిలు కూడా సిగరెట్ తాగుతున్నారు.
అయితే పక్కన ఎవరో సిగరెట్ తాగుతున్నారు నాకేం అవుతుందిలే అని అలవాటు లేని వారు అనుకోకూడదు. సిగరెట్ తాగే వారికి ఎలాగో వారి ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు, కానీ పక్కన ఉన్న వారు ఆ పొగ పీల్చడం వలన కూడా క్యాన్సర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలవాటు ఉన్న పెద్ద వారు చిన్న పిల్లల దగ్గర అసలు సిగరెట్ తాగకండి. సిగరెట్ పొగ ఎక్కువగా చిన్న పిల్లల మీద చాలా ప్రభావం చూపుతుంది.. వీరిలో వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు వచ్చాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు, లేని వారి దగ్గర నుండి కొంచెం దూరంగా వెళ్లి తాగడం మంచిది. అదేవిధంగా ఈ అలవాటు లేని వారు సిగరెట్ తాగే వారి నుండి దూరం పాటించడం మంచిది.