ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.. వద్దన్నా నిద్ర ముంచుకొస్తుంది

sleeping tips for good sleep at night

నీ దగ్గర కోట్ల ఆస్తి ఉన్నా కూడా ప్రశాంతంగా నువ్వు నిద్రపోలేకపోతున్నావంటే.. నీదగ్గర అంత డబ్బు ఉండి కూడా వేస్ట్. కూటికి లేనోడు కూడా నేడు ఫుట్ పాత్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ.. కోట్ల ఆస్తి ఉన్నా.. మంచి ఇల్లు ఉన్నా.. అన్నీ ఉన్నా రాత్రి నిద్ర మాత్రం పట్టదు కొందరికి. అదేంటో.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా… రాత్రిళ్లు కొందరికి నిద్ర ఎందుకు పట్టదు? మరికొందరు మాత్రం ఎటువంటి సౌకర్యాలు లేకున్నా నేల మీద పడుకున్నా.. ప్రశాంతంగా నిద్రపోతారు. గుర్రుకొడుతూ గాఢ నిద్రలోకి పోతారు. అందరూ మనుషులే కానీ.. కొందరికి నిద్ర మంచిగా పడుతుంది.. మరికొందరికి పట్టదు.. ఎందుకు.. అంటే ఇక్కడే ఓ తిరకాసు ఉంది. అదే తెలుసుకుందాం పదండి..

sleeping tips for good sleep at night
sleeping tips for good sleep at night

నిజానికి ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఓ వరం. ఆ వరం అందరికీ ఉండదు. అందరికీ ఉంటుంది కానీ.. కావాలని కొందరు తమ వరాన్ని తామే చెడగొట్టుకుంటారు. అయిన దానికి.. కాని దానికి టెన్షన్లు పెట్టుకొని రాత్రిళ్లు నిద్రలేని జీవితాన్ని గడుపుతుంటారు.

ఓ సర్వే ప్రకారం.. ఎక్కువగా నిద్ర పట్టని వాళ్లు చెప్పే కారణాలు ఏంటో తెలుసా? ప్రతి దానికి టెన్షన్ పడటం.. రేపు ఏమౌతుందో అని భయపడటం.. డబ్బు లేదనే టెన్షన్.. ఉద్యోగం టెన్షన్.. రేపు జాబ్ ఉంటుందా? ఊడుతుందా? అనే టెన్షన్.. బంధువుల టెన్షన్.. పెళ్లి అయితే భార్యాభర్తల టెన్షన్, పిల్లల టెన్షన్.. ఇలా ప్రతి విషయానికి టెన్షన్ పడేవాళ్లకు రాత్రిళ్లు నిద్ర కూడా సరిగ్గా పట్టదట.

ఒత్తిడి ఎంత తగ్గించుకొని.. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్ర లేకపోతే.. ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. దాంతో ఏ పనీ సరిగ్గా చేయలేకపోతారు.

అందుకే.. నిద్ర పోవాలంటే కేవలం శారీరకంగా సిద్ధం అవడం కాదు.. మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. అంటే.. బెడ్ మీదికి అయితే వెళ్తారు కొందరు కానీ.. బుర్రలో ఎన్నో ఆలోచనలు గిర్రున తిరుగుతుంటాయి. అందుకే.. నిద్ర పోయేటప్పుడు ఎక్కువగా ఆలోచించకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి ఆలోచనలకు తావు ఇవ్వకూడదు.

ఒకవేళ ఆలోచనలు వస్తే ఆనందంగా ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకోండి కానీ.. బాధపడతు ఉండే క్షణాలను గుర్తు తెచ్చుకుంటే ఉన్న ప్రశాంతత కూడా పోతుంది. అందుకే ఆనంద క్షణాలను గుర్తు తెచ్చుకుంటే ప్రశాంతత లభిస్తుంది.

ఒక వేళ ఎంత ట్రై చేసినా నిద్ర పట్టకపోతే.. 15 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. దాని వల్ల శరీరానికి, మనసుకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. ఆంధోళన కూడా తగ్గుతుంది.

మీకు ఏం జరిగినా.. అంతా మన మంచికే అని అనుకోండి. ఎవరో ఏదో అన్నారని బాధపడకండి. ఎవరు ఏమనుకుంటే నాకేంది.. అని అనుకోండి. లేనిపోని విషయాల గురించి ఆలోచించకండి. జస్ట్ రిలాక్స్ అవండి.. అంతే నిద్ర అదే వస్తుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో.. అప్పుడు వద్దన్నా నిద్ర వస్తుంది.