ఓహ్ ఇదా పోలవరం విషయం లో జగన్ స్కెచ్ ? వర్క్ ఔట్ అవ్వడం గ్యారెంటీ ?

cm jagan

 ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా పిలుచుకునే పోలవరం ప్రాజెక్టు కల దాదాపు బ్రిటిష్ కాలం నుండి ఉంది. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే దానికి సంబంధించిన అనేక చిక్కుముడులను విప్పుతూ ప్రాజెక్టు కు ఒక రూపాన్ని తీసుకోని వచ్చాడు. వైఎస్ అకాల మరణం తర్వాత పోలవరంలో అనుకున్నంత పురోగతి లేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పోలవరం విషయంలో ఎదో చేస్తున్న అనే భ్రమలు కలిగించాడు కానీ, పూర్తిస్థాయిలో దానిని చేయలేకపోయాడు.

polavaram

 ఇక వైసీపీ సర్కార్ వచ్చి 2021 చివరి నాటికీ పోలవరం పూర్తిచేస్తామని హామీలు ఇచ్చింది. కానీ తాజాగా కేంద్రం పెట్టిన కిరికిరితో అది సాధ్యం కాకపోవచ్చని తెలుస్తుంది. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు విషయంలో రూ. 47615 కోట్లతో సవరించిన అంచనాలకు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు కేంద్ర జలశక్తి శాఖ కూడా ఆమోదం తెలిపింది. అయితే తాజాగా ఆర్ధికశాఖ మొకాలడ్డింది. 2014లో ఆమోదించిన అంచనాల ప్రకారం రూ. 20 వేల కోట్లే ఇస్తామని చెప్పేసింది. ఈ అంశమే ఇపుడు ఏపిలో హాట్ టాపిక్ అయిపోయింది.

 పోలవరంకు నిధులిచ్చే విషయంలో కేంద్రం తాజా వైఖరికి చంద్రబాబునాయుడు ప్రభుత్వమే కారణమని వైసీపీ సర్కార్ మండిపోతోంది. ఇదే సమయంలో తమ హయాంలో రూ. 55 వేల కోట్లకు ఆమోదం తెలిపిన కేంద్రప్రభుత్వం ఇపుడు మాటమార్చటం వెనుక జగన్ చేతకాని తనమే ఉందంటూ టీడీపీ నేతలు ఎదురుదాడులు మొదలుపెట్టారు. ఇందులో ఏది నిజం ? ఏది అబద్ధం ? అనేది ఇప్పుడిప్పుడే తేలేది కాదు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల్లో ఎవరిది తప్పన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇద్దరి నిస్సహాయతను కేంద్రప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకుంటోందన్నది మాత్రం వాస్తవం.

cm jagan

 ఒకరి మీద మరొకరు విమర్శలు చేస్తుంటే పోలవరం పూర్తికాదని, పూర్తిగా కేంద్రం మీద ఆధారపడిన పూర్తి అయ్యే పరిస్థితులు లేవని భావించిన సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఫండింగ్ చేసే ప్రపంచబ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకుతో పాటు మరికొన్ని ఆర్ధిక సంస్దల విషయాన్ని కూడా జగన్ ఆర్ధిక సలహాదారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్రానికి లేఖ రాసిన జగన్ అక్కడ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో ఎదురుచూసి అందుకు తగ్గట్లు కార్యాచరణ చేయాలనీ అనుకుంటున్నాడు.

 ప్రపంచబ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకుతో పాటు మరికొన్ని ఆర్ధిక సంస్దల నుండి రుణం తీసుకోవాలంటే రాష్ట్రప్రభుత్వం తీసుకునే అప్పులను తీర్చే విషయంలో కేంద్రం కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాల్సుంటుంది. ఎలాగూ కేంద్రం నిధులను ఇవ్వటం లేదు, కాబట్టి కనీసం తీసుకునే అప్పుకు గ్యారెంటీ ఇవ్వాలని జగన్ కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి జగన్ కోరిక మేరకు కేంద్రం గ్యారెంటీ ఇస్తే పోలవరం అనుకున్న సమయానికి అటుఇటుగా పూర్తికావచ్చు , మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.