‎Singer Suchitra: ఆవేదన వ్యక్తం చేసిన సింగర్ సుచిత్ర.. వాడు పెద్ద మోసగాడు అంటూ!

‎Singer Suchitra: సుచీ లీక్స్‌ తో కోలీవుడ్‌ లో వైరల్ అయిన వివాదాస్పద సింగర్‌ సుచిత్ర. సుచీ లీక్స్ తో బాగా వైరల్ అయ్యింది ఈ సింగర్. కాగా ఈమె గతంలో ఈమె పలువురు స్టార్స్‌ పై తీవ్రమైన ఆరోపణలు చేసి కోలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. అంతేకాకుండా తన మాజీ భర్త కార్తీక్‌ గే అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నాను అంటూ బాంబ్‌ పేల్చింది.

‎ఈ వివాదంలోకి హీరో ధనుష్‌ ను కూడా లాగిన విషయం తెలిసిందే. ఫుల్ గా మద్యం సేవించి హీరో ధనుష్‌, కార్తీక్‌ ఒకే గదిలో ఉండేవారు అని ఆమె తెలిపింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సింగర్ సుచిత్ర మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు కాబోయే భర్త షణ్ముగరాజ్ మోసం చేశాడంటూ ఆరోపించింది.

‎ అంతేకాకుండా తన ఇంటితో పాటు డబ్బులను లాక్కున్నాడని వీడియోను రిలీజ్ చేసింది. అతనితో తనకు నిశ్చితార్థం అయిందని ఆ తర్వాత అతని చేతిలో తీవ్రమైన గృహ హింసకు అనుభవించానని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేసింది. షణ్ముగరాజ్ పెద్ద మోసగాడని అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపింది. కాగా తాజాగా సింగర్ సుచిత్ర చేసిన వాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి.