సుడిగాలి సుదీర్ టాలెంట్ కు ఫిదా అయిన సింగర్ చిత్ర.. ఏమన్నారంటే?

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా బాగా గుర్తింపు పొందిన చిరుగాలి సుదీర్ మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు పొన్నాడు. సుధీర్ కామెడీ చేయడమే కాకుండా తన మ్యాజిక్ తో అందరిని మాయ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా సుధీర్ అద్భుతంగా పాటలు పాడుతూ డాన్స్ కూడా చేస్తాడు. కొంతకాలం క్రితం సుధీర్ తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన జబర్దస్త్ షో ని వదిలి మాటీవీలో ప్రసార పోతున్నాం సూపర్ సింగర్ జూనియర్స్ అనే షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇంతకాలం తన కామెడీతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధీర్ ఇప్పుడు యాంకర్ గా తన టాలెంట్ నిరూపించుకున్నాడు . ఇప్పటివరకు చాలా టీవీ షోస్ లో రష్మీ కోసం పాట పాడిన సుధీర్ తాజాగా సూపర్ సింగర్ జూనియర్స్ వేదిక మీద కూడా తన సింగింగ్ టాలెంట్ నిరూపించుకున్నాడు. ఈ షో సుధీర్ పాట పాడిన తీరుకి అందరూ ఫిదా అయ్యారు. ప్రముఖ సింగర్ చిత్ర గారు కూడా సుధీర్ పాటకి ఫిదా అయ్యి స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాల్సిందే అని అనింది. ఇటీవల ప్రసారమైన సూపర్ సింగర్ జూనియర్స్ ఎపిసోడ్లో సుధీర్ చిత్ర గారితో కలిసి అందం హిందోళం అనే పాటని పాడాడు. ఈ క్రమంలో హేమచంద్ర కూడా సుధీర్ టాలెంట్ కి తన పొగడ్తలతో ముంచెత్తాడు. హేమచంద్ర మాట్లాడుతూ ముందు నుండే నేను నీకు ఫ్యాన్ ఇక ఈ పర్ఫామెన్స్ చూసిన తర్వాత మీ డేడ్యుకేషన్ కి నా హాండ్స్ ఆఫ్ అంటూ పొగిడాడు.