వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కొత్త లెక్క.! టీడీపీ వైపు వెళుతున్నట్టేనా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పుడెప్పుడు టీడీపీలో చేరిపోదామా.? అన్న ఆశతో వున్నట్లున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 100కి పైగా స్థానాల్లో గెలుపు దక్కుతుందని రఘురామకృష్ణరాజు తాజాగా జోస్యం చెప్పారు మరి.

92 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందట. సుమారు 60 స్థానాల్లో టఫ్ ఫైట్ వుంటుందట. ఓ ఐదారు చోట్ల త్రిముఖ పోటీ వుంటుందట. ఇంతకీ, ఇక్కడ జనసేన పరిస్థితేంటి.? ఇదైతే రఘురామకృష్ణరాజుకే తెలియాలి. అసలు ఏ ప్రాతిపదికన ఎవరు చేసిన సర్వే ఇది.? అన్నదానిపై రఘురామ స్పష్టతనివ్వలేదు.

తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి వుంది. జనసేన పార్టీ అయినా, కాస్తంత రిస్క్ చేసి యంగ్ జనరేషన్‌కి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తుంది గనుక, ఆ పార్టీకి అభ్యర్థుల కొరత అనేది వుండదు. గెలుపోటములు పెద్దగా ఆ పార్టీని ప్రభావితం చేయబోవని 2019 ఎన్నికలతో నిరూపణ అయిపోయింది.

అయితే, తెలుగుదేశం పార్టీ పరిస్థితి అది కాదు. 2024 ఎన్నికలు ఆ పార్టీకి ‘చావో రేవో’ అన్న చందమే. సో, ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన క్రమంలో ఇతర పార్టీల నుంచి కీలక నాయకుల్ని లాగేయడం, పెద్ద మొత్తంలో సొమ్ములు ఖర్చు చేయడం.. ఇలా వుంటుంది కథ. ఇంతా చేసినా టీడీపీ తన ఉనికిని చాటుకునే పరిస్థితి లేదు.

టీడీపీకి జాకీలేసే ప్రయత్నంలో రఘురామకృష్ణరాజు ఇంకోసారి గట్టిగా బోల్తా కొట్టేశారు. మొత్తంగా రఘురామ సర్వే ఓ ఫేక్ వ్యవహారమని తేలిపోయింది. ట్రయాంగిల్ ఫైట్ అనేది ఓ డెబ్భయ్ నుంచి ఎనభై సీట్లలో ఈసారి ఖచ్చితంగా వుండబతోంది.

ఇలాంటి సందర్భాల్లో సహజంగానే అధికార పార్టీకి అడ్వాంటేజ్ వుంటుంది.. ఎందుకంటే, ఆ స్థాయిలో వైసీపీ బలంగా వుంటుంది గనుక.