Betting App: బెట్టింగ్ యాప్ ప్రమోషన్… పోలీసు విచారణకు హాజరైన వైసీపీ మహిళా నేత!

Betting App: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలు యూట్యూబర్స్ పై పెద్ద ఎత్తున పోలీసులు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పలువురు సెలబ్రిటీలపై కేసులో నమోదు అయ్యాయి ఈ క్రమంలోనే ప్రతిరోజు కొంతమంది సెలబ్రిటీలు విచారణకు కూడా హాజరవుతున్నారు.

ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకుల జీవితాలను బలి తీసుకుంటున్న వారు ఎలాంటి వారైనా వెనకడుగు వేయద్దని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినటువంటి విష్ణు ప్రియ రీతూ చౌదరి టేస్టీ తేజ కిరణ్ గౌడ్ వంటి వారందరూ కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ యాంకర్ వైసీపీ మహిళా నేత యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. ఇక ఈమెపై కూడా కేసు నమోదు కావడంతో తనకు ముందస్తు అరెస్టులు ఉండకూడదు అంటూ ఈమె తెలంగాణ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈమెకు అనుకూలంగా తీర్పు ఇస్తూ తనని అరెస్టు చేయకుండా విచారణ కొనసాగించాలని ఆదేశాలను జారీచేశారు.

ఈ క్రమంలోనే పోలీస్ విచారణలో భాగంగా నేడు శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు. ఇక ఈ విచారణలో భాగంగా శ్యామలను ఎలాంటి ప్రశ్నలు వేశారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ విషయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లోనూ పలువురిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, మంచులక్ష్మీ, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శోభాశెట్టి, సిరి హన్మంతు, శ్రీముఖి ఉన్నారు.