Shruthi Hassan: కరోనా పాజిటివ్ ఐసొలేషన్ లో చాలా నీరసించి పోయాను: శృతిహాసన్

Shruthi Hassan: టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ గురించి మనందరికీ తెలిసిందే. శృతిహాసన్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇదిలాఉంటే ఇటీవలే శృతిహాసన్ కరోనా బారిన పడినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా సోకిందని, ఇక తాను ప్రస్తుతం తాను ఐసొలేషన్ లో ఉన్నట్లు ఉన్నట్లు తెలిపింది.అలాగే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంది అని తెలిపింది. ఇదే విషయాన్ని శృతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో చేసేసుకుంది.

కరోనా సమయంలో ఐసోలేషన్ లో తన కష్టాలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది ఈ బ్యూటీ. కరోనాతో చాలా నీరసించి పోయానని, ఏం చేయాలో తెలియడంలేదు అంటూ పోస్ట్ చేసింది. ఆ పోస్టు చూసిన అభిమానులు సెలబ్రిటీలు శృతిహాసన్ త్వరగా కోలుకోవాలి అని కామెంట్ చేస్తున్నారు. శృతి హస్సన్ ఆ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ మీ అందరి ఆశీస్సులతో త్వరలోనే మీ ముందుకు వస్తాను అని సమాధానమిచ్చింది.