బాలీవుడ్‌లో మ‌రో ప్రేమ వివాహం.. కూతురి ప్రేమ‌కు పూర్తి మ‌ద్దతు అంటున్న తండ్రి

కరోనా కారణమో తెలీదు.. లేదంటే జీవితంలో పెళ్ళి అనే మధుర ఘట్టానికి తెరలేపే ఉద్దేశ్యమో తెలీదు.. 2020 సంవత్సరం నుండి సాధారణ ప్రేక్షకుల పెళ్ళిళ్ళు ఏమో గానీ.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ సినీ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళ హావా మాత్రం విపరీతంగా పెరిగింది. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాదిలోనే ఎంతో మంది సెలెబ్స్ పెళ్ళిళ్ళు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా తన చిన్న నాటి స్నేహితురాలిని పెళ్ళిచేసుకున్నాడు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. ఇష్టపడిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే ఆ కిక్కే వేరంటున్నాడు. అలాంటి సంతోషానికి అవధులు లేవంటున్నాడు ఈ హీరో. నటాషా దలాల్ కు, వరుణ్ ధావన్ కు సినీ ఇండస్ట్రీ నుండి అభిమానం ఉప్పోంగుతోంది.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ట కూడా నూతన వధూవరులకు విష్ చేస్తూ.. మీరు చాలా లక్కీ అంటూ బ్యూటిఫుల్ కోట్ పెట్టారు. ఈ పోస్ట్ కి వరుణ్ ధావన్ రిప్లై ఇస్తూ.. అతి త్వరలోనే రోహన్ పెళ్ళి శుభవార్త కూడా వింటానని.. త్వరలోనే ఆ వార్త తెలియజేయాలని కోరారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ బ్యూటీ శ్రధ్దా కపూర్ కూడా ఈ ఏడాది పెళ్ళి చేసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వెలువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే శ్రద్ధా కపూర్ తండ్రి.. సీనియర్ యాక్టర్ శక్తి కపూర్ మీడియాకి స్పందిస్తూ.. శ్రద్ధా పెళ్ళి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని.. బయట రూమర్లు నడవడం సహజమని.. కానీ భవిష్యత్ లో తాను ఎవ్వర్నైనా ఇష్టపడి.. పెళ్ళి చేసుకుంటానని తీసుకువచ్చినా.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నారు. అలాగే రోహన్ శ్రేష్ట చాలా మంచి అబ్బాయని.. తమకు చిన్నతనం నుండి మంచి స్నేహితులని..ఇప్పటికీ వారిద్దరి మధ్య అలాంటి స్వచ్చమైన స్నేహం మాత్రమే ఉందని.. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకోవడం లేదని తెలిపారు. అదేవిధంగా శ్రద్ధా కపూర్ ప్రస్తుతం కెరీర్ పైనే ఫోకస్ చేస్తుందని.. ఒకవేళ ఆమె పెళ్ళి పట్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా తెలియజేస్తామని అన్నారు.