సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను దానం చేస్తే అరిష్టం కలుగుతుందా?

హిందువులు ఎన్నో ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తారనే సంగతి తెలిసిందే. హిందువులు సూర్యాస్తమయం తర్వాత ఇతరులకు చేసే దానాల విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. జోతిష్య శాస్త్రం సైతం దానధర్మాలను చేయడం ద్వారా అనుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇంట్లో వంటకాలలో కచ్చితంగా వాడే వాటిలో ఉప్పు ఒకటనే సంగతి తెలిసిందే.

ఉప్పును ఇతరులకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలగవని పండితులు చెబుతున్నారు. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అని సూర్యాస్తమయం తర్వాత ఉప్పును దానం చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. సాయంకాలం సమయంలో ఉప్పును దానం చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. సూర్యాస్తమయం తర్వాత కొంతమంది పాలను ఇతరులకు దానం చేస్తూ ఉంటారు.

అయితే ఈ విధంగా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. సూర్యాస్తమయం తర్వాత పాలను దానం చేయడం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయి. పాలు సూర్యచంద్రులకు ప్రతీక కాగా వీటిని దానం చేయడం ఏ మాత్రం మంచిది కాదు. ఇరుగుపొరుగు వాళ్లు కొన్ని సందర్భాల్లో కూరగాయలు కావాలని కోరుతూ ఉంటారు. కూరగాయలను ఇతరులకు సూర్యాస్తమయం తర్వాత దానం చేయడం మంచిది కాదు.

సూర్యాస్తమయం తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి దానం చేయడం కూడా ఏ మాత్రం మంచిది కాదు. దానధర్మాలు చేసేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. దానధర్మాలను చేసేవాళ్లు ఈ నియమాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.