దొండకాయని చూపెడుతూ తన పరువు తానే తీసుకున్న పొట్టి నరేష్.. సిగ్గుపడుతూ తలదించుకున్న ఇంద్రజ?

జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి రోజా అనారోగ్య కారణంగా కొన్ని రోజులపాటు ఈ కార్యక్రమానికి దూరం అవడంతో ఈ కార్యక్రమానికి ఇంద్రజ వచ్చారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అందరిని సందడి చేసిన ఈమె రోజా రావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.అయితే కొద్ది రోజుల తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి దూరమైన ఈమె తిరిగి మరోసారి ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ నా కొడుకు అనే కాన్సెప్ట్ ద్వారా వచ్చింది.

ఇందులో భాగంగా కృష్ణ భగవాన్ కుమారుడు చిన్నప్పుడే తప్పిపోయాడని తన కొడుకుకు పచ్చిమిర్చి తినే అలవాటు ఉందంటూ కమెడియన్స్ అందరి చేత పచ్చిమిర్చి తినిపించాడు. అలాగే రూపాయితో పది రూపాయలు సంపాదించే టాస్క్ కూడా ఇచ్చారు.ఇలా ఈ టాస్కుల భాగంగా ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారం చేయగా ఆటో రాంప్రసాద్ మాత్రం కూరగాయల వ్యాపారం చేశారు. ఆటో రాంప్రసాద్ దగ్గర కూరగాయలు కొనడానికి పొట్టి నరేష్ వచ్చి ఏకంగా తన పరువును మొత్తం తానే తీసుకున్నాడు.

జబర్దస్త్ కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే డబుల్ మీనింగ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా పొట్టి నరేష్ కూరగాయలు కొనడానికి వచ్చి దొండకాయను తీసుకొని దొండకాయ ఏంటి ఇంతే ఉంది అని నరేష్ అనగా వెంటనే రాంప్రసాద్ ఎక్కడో చూసినట్టు ఉంది కదా? అంటూ నరేష్ ను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇలా పరోక్షంగా పొట్టి నరేష్ గురించి డబుల్ మీనింగ్ డైలాగులు వేయడంతో ఇంద్రజ సిగ్గుతో తల పక్కకు తిప్పుకోగా అక్కడున్న వారు మాత్రం ఈ డబుల్ మీనింగ్ డైలాగులకు పగలబడి నవ్వారు. ఏది ఏమైనా కామెడీ చేయటంలో జబర్దస్త్ కమెడియన్లకు ఎవరు సాటిరారని చెప్పాలి.