Indraja: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక టాక్ షో, ఒక సినిమా లేదా ఒక వెబ్ సిరీస్ అయినా కూడా పెద్ద ఎత్తున డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటం జరుగుతుంది. అయితే బుల్లితెరపై ప్రసారం అవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఇక ఈ కార్యక్రమంలో డబుల్ మీనింగ్ డైలాగులకు ఏమాత్రం కొదువు లేదని చెప్పాలి.
ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్లు జడ్జిలపైన అలాగే యాంకర్ల పైన ఇంకా శృతి మించితే రాజకీయ నాయకులపై కూడా డబ్బులు మీనింగ్ డైలాగులు వేస్తూ అందరిని నవ్విస్తున్నారు. అయితే ఇదే విషయం గురించి గతంలో కొంతమంది ఓపెన్ అవుతూ సంచలన విషయాలను బయట పెట్టారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న నటి ఇంద్రజ సైతం ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమంలో వేసే డబుల్ మీనింగ్ ఆ డైలాగులు గురించి ఈమె మాట్లాడారు. జబర్దస్త్ కార్యక్రమంలో డబుల్ మీనింగ్ జోక్స్ డోస్ కాస్త ఎక్కువైంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఇంద్రజ సమాధానం చెబుతూ… జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లు డబల్ మీనింగ్ జోక్స్ వేస్తూ ఉంటారు. చివరికి నాపై కూడా వారు అలాంటి జోకులు వేస్తారని ఇంద్రజ తెలిపారు.
జబర్దస్త్ షో అనేది సక్సెస్ షో కదా ప్రస్తుతం ఇలాంటివి చాలా చోట్ల ఉన్నాయి. ఓటీటీ కంటెంట్, సినిమాలలో కూడా ఈ విధమైనటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతున్నారు అంటూ ఇంద్రజ జబర్దస్త్ కార్యక్రమంలో వేసే జోక్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేయకుండా సమర్థించారనే చెప్పాలి. ఇలా డబల్ మీనింగ్ డైలాగ్స్ జోక్స్ గురించి ఇంద్రజ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.