డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల అవుతున్న కథాకమామిషు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

ప్రతివారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆహా ఓటీటీ ప్లాట్ఫారం ఎప్పటికప్పుడు ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. ఈ మధ్యనే సత్యదేవ్ నటించిన యాక్షన్ త్రిల్లర్ మూవీ జీబ్రా, సోనియా అగర్వాల్ నటించిన 7/g ది డార్క్ స్టోరీ అనే హర్రర్ సినిమాని అందించింది. ఇక నీలిమేఘ శ్యామా అనే మరో మూవీ ని కూడా త్వరలోనే స్టీమింగ్ చేయబోతుంది. అలాగే కథకమమీషు అనే కొత్త సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకువస్తోంది.

ఇంద్రజ, కృతిక, వెంకటేష్ కాకుమాను, కృష్ణ ప్రసాద్ లు ప్రధాన పాత్రలలో నటించారు. గౌతం కార్తీక్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. చిన్న వాసుదేవ రెడ్డి, ఐ డ్రీమ్ మీడియా, త్రీ విజిల్స్ టాకీస్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. దృవం ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 2 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు ఆహా టీం.

గ్రామీణ ప్రాంతంలోని ప్రేమలు అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపు దిద్దుకున్నట్లుగా టీజర్ ని చూస్తే తెలుస్తోంది. నాలుగు జంటలు వాళ్లకు పెళ్లి ఫస్ట్ నైట్ కష్టాలు చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ట్రైలర్ తోనే కడుపుబ్బ నవ్వించారు కధా కమామిషు మూవీ టీం. పలాస, మట్కా ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కరుణ్ కుమార్ ఈ సినిమాలో ఒక ఫన్నీ పాత్రలో కనిపించడం విశేషం. అంతే కాదు ఈ సినిమాకి కథని అందించింది కూడా ఇతనే.

నిజానికి ఈ సినిమాని మొదట థియేటర్లలో రిలీజ్ చేయాలని ఈ మేకర్స్ భావించారు కానీ డిస్ట్రిబ్యూటర్లు దొరకకపోవటంతో చివరికి ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమయ్యారు. ఆహా వీడియో ఓటీటీ ఈ మూవీ డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంది కొన్నాళ్ళ కిందట కమింగ్ సూన్ అంటూ ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది ఇక ఇప్పుడు జనవరి 2 నుంచి మూవీస్ ట్రైనింగ్ అవుతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది.

Katha Kamamishu Trailer | Indraja, Krutika Roy, Venkatesh Kakumanu | ahavideoIN