Crime News: దేశంలో ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతోంది. పాత కక్షలు, ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలు,కుటుంబ కలహాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుత కాలంలో డబ్బుకు ఉన్న విలువ బంధాలకి బంధుత్వాలకి లేకుండా పోయింది. డబ్బు కోసం కొందరు ఎటువంటి నీచానికైనా దిగజారటానికి వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ఎంతోమంది హత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి నేరాలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టిన వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా హైదరాబాద్ నగర శివారులో జరిగిన కాల్పులు కలకలం రేపాయి.
వివరాల్లోకి వెళితే..రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నడిరోడ్డుపై రఘు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పై మర్డర్ ఎటాక్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా ఇంకొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదు నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయిన రఘు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తులపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. రఘు అనే వ్యక్తికి చేతిలో రెండు బుల్లెట్లు తగలటం వల్ల అతని పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనకు సంబంధించి వ్యాపార లావాదేవీలు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా ఇంకొక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు కానీ ఈ కాల్పులను ఎవరు జరిపారో అనీ పోలీసులు అనుమానిస్తున్నారు.సెటిల్ మెంట్ కి పిలిచి ఇలా కాల్పులు జరిపారని పోలీసులు పేర్కొన్నారు.హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఓ SUV కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లినట్లుగా కనిపిస్తోంది. కారుపై నెత్తుటి మరకలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.