Gayathri passes away : షాకింగ్ న్యూస్ : తెలుగు యంగ్ వెబ్ సిరీస్ ల నటి కన్నుమూత..వివరాలు ఇవే.!

Gayathri passes away : తాజాగా తెలుగు సినిమా నాట మరో తీరని విషాదం నెలకొంది. సినిమాల్లో రాణించాలని ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్ అయ్యిన పలువురు యంగ్ నటులు ఉన్నారు. వారిలో చాలా మంది వెండితెర వరకు సక్సెస్ కాగా  తమ కెరీర్ ని బిల్డప్ చేస్తూ వెళ్తున్నారు. అయితే తాజాగా అలాంటి ఓ యంగ్ నటినే తన జీవితాన్ని సగం కూడా పూర్తి కాకుండా ముగించుకోవాల్సి వచ్చింది.
ఆమెనే యూట్యూబ్ మరియు ఓటిటి లో పలు వెబ్ సిరీస్ లలో నటించి అలరించిన యంగ్ నటి గాయత్రి. డాలీ గా చిన్ని తెర వీక్షకులకు ముఖ్యంగా యువతకు ఈమె బాగా తెలుసు. అయితే ఇప్పుడు ఈమెనే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వార్త షాకింగ్ గా మారింది.
ఇక ఈ వివరాల్లోకి వెళితే నిన్న హోళీ సంబరాల్లో తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో కారులో వారితో ప్రయాణిస్తుండగా అతి వేగం కారణంగా పెద్ద ప్రమాదం సంభవించి ఈమె కన్ను మూసినట్టుగా సినీ వర్గాల్లో కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఈమెతో నటించిన సహా నటులు మరియు సీనియర్ నటి సురేఖ వాణి తదితరులు తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ వార్త షాకింగ్ గా మారి సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.
https://www.instagram.com/p/CWxptEfpXIF/