రోజు రోజుకి యువకులు ప్రేమను మాదులుగా మారుతున్నారు. అమ్మాయి అందంగా ఉంటే చాలు ప్రేమ అంటూ వారి వెంటపడి వారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా వారి ప్రేమను నిరాకరించకపోతే ఉన్మాదులుగా మారి అమ్మాయిల మీద దాడులకు పాల్పడుతున్నారు. మరి కొంతమంది ఏకంగా యువతుల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. తన ప్రేమలో నిరాకరించినందుకు ఒక దుర్మార్గుడు యువతిని కారుతో కొద్దీ హతమార్చడానికి ప్రయత్నం చేశాడు.
వివరాలలోకి వెళితే… అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కంబదూరు మండలం బోయలపల్లి వద్ద ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా యువకుడు సదరు బాధితురాలని ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడేవాడు. తన ప్రేమను అంగీకరించాలని, తనను ప్రేమించకపోతే చంపేస్తానని యువకుడు బాధితురాలిని బెదిరించాడు. అయితే ఆ యువకుడు ఆమెకు అన్న వరుస కావటంతో యువతి అతని ప్రేమను నిరాకరించింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో సదరు నిందితుడు ఎలాగైనా యువతని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో ఇటీవల సదరు యువకుడు తన ప్రేమను నీరాకరించినందుకు యువతిని కారుతో గుద్ది హతమార్చడానికి ప్రయత్నం చేశాడు. యువకుడు యువతిని కారుతో గుద్ధి అక్కడి నుండి తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నంలో కారు వేగంగా దూసుకుపోయి చెట్ల పొదలలోకి వెళ్లిపోయింది. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకొని పరిశీలించగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని భావించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి యువకుడిని విచారించగా అసలు విషయం బయటపడింది.
కక్ష సాధింపు చర్యగానే సదరు యువకుడు యువతిని కారుతో గుద్దినట్లు అంగీకరించాడు. ఈ ప్రమాదంలో యువతి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడింది. వెంటనే యువతని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.