Akhanda In First Time : బాలయ్య “అఖండ” కి షాకింగ్ టీఆర్పీ.. ఇంత తక్కువ ఊహించి ఉండరు.!

Akhanda In First Time : గత ఏడాదిలో ఓపెనింగ్స్ పరంగా పక్కన పెడితే సినిమా లాభాల ప్రకారం చూసినట్టు అయితే మన తెలుగులో భారీ హిట్ గా నిలిచిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన మాస్ ఏక్షన్ చిత్రం “అఖండ” అని చెప్పాల్సిందే.
దర్శకుడు బోయపాటి శ్రీను తో బాలయ్య చేసిన ఈ హ్యాట్రిక్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలనే అందించింది. థియేటర్స్ లో మాత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ దగ్గర ఒక అద్భుత రన్ అందుకున్న సినిమాగా నిలిచింది.
ఇక ఇదే ఊపులో ఓటిటి లో కూడా రిలీజ్ చెయ్యగా మన సౌత్ ఇండియన్ సినిమాలో పలు డైరెక్ట్ రిలీజ్ అయ్యిన సినిమాల కంటే అధిక రెస్పాన్స్ అందుకొని నెంబర్ 1 సినిమాగా నిలిచింది. అయితే దీని తర్వాత ఎట్టకేలకు టీవిలో కూడా ప్రసారంకి రాగా ఇక్కడా రికార్డు నమోదు చేస్తుంది అనుకుంటే ఇక్కడ మాత్రం షాక్ తప్పలేదు.
టెలివిజన్ పై మాత్రం ఈ సినిమాకి కేవలం 13.3 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ మాత్రమే వచ్చాయి. ఇది ఇలాంటి హిట్ సినిమా పైగా ఫస్ట్ టైం ప్రీమియర్ కి చాలా తక్కువ రేటింగ్ అని చెప్పాలి. మొత్తానికి అయితే బాలయ్య భారీ హిట్ కి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. మరి ఏఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. శ్రీకాంత్ పూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటించారు.