నాగచైతన్య కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం… క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించిన బోయపాటి!

నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత వరుస బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే చైతన్య లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి వరుస సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నారు.ప్రస్తుతం ఈయన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నటించిన థ్యాంక్యూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా నాగచైతన్య దూత అనే మరొక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా మరో సినిమాకి నాగచైతన్య పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు.

ప్రస్తుతం ఈయన ‘మానాడు’ ఫేం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ద్విభాష చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా నేడు హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకుడు బోయపాటి శ్రీను, భారతీరాజా హీరో రానా దగ్గుబాటి, శివ కార్తికేయన్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రానా కెమెరా స్విచాన్ చేయగా బోయపాటి నాగచైతన్య, కృతి శెట్టి పై క్లాప్ కొట్టారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.

ఇక నాగచైతన్య ఇదివరకే కృతి శెట్టితో కలిసి బంగార్రాజు చిత్రంలో సందడి చేశారు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో మరోసారి నాగచైతన్య కృతి శెట్టితో జతకట్టారు. ఇక నాగచైతన్య నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా,సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న వెబ్ సిరీస్ దూత ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇక తాజాగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.