Nagachaitanya: బోయపాటి వద్దకు తండేల్….. పప్పులో కాలువేస్తున్న చైతూ?

Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇలా నాగచైతన్యకు వరుస డిజాస్టర్ సినిమాలు రావడంతో ఆయనకు సూపర్ హిట్ సినిమా అవసరమైంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య హీరో హీరోయిన్లుగా తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా వందకోట్ల కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చైతన్య తదుపరి సినిమా ఏంటి అనే విషయంపై అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈయన విరుపాక్ష సినిమా ఫేమ్ కార్తీ దండు దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య బోయపాటి శ్రీను సినిమాకు కమిట్ అవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక బోయపాటి సినిమాలు అంటే ఎలా ఉంటాయో మనం అందరికీ తెలిసిందే ఈయన సినిమాలలో పెద్ద ఎత్తున యాక్షన్ సన్నీ వేషాలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ క్రమంలోనే బోయపాటి నాగచైతన్య కాంబినేషన్లో వచ్చే సినిమా కూడా ఈ తరహా సినిమా అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరికొందరు మాత్రం బోయపాటితో సినిమాకు కమిట్ అయ్యి చైతు పప్పులో కాలు వేస్తున్నారా అంటూ కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ బోయపాటితో సినిమా ఓకే అయినప్పటికీ ఈ చిత్రాన్ని కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ బ్యానర్ లో నాగచైతన్య 100% లవ్ సినిమాతో హిట్ కొట్టారు. తాజాగా తండేల్ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మరి బోయపాటి నాగచైతన్య కాంబోలో సినిమా వస్తుందనేది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బోయపాటి అఖండ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు.