Balakrishna: బోయపాటి పై ఫైర్ అయిన బాలయ్య… బోయపాటి తీరు నచ్చలేదా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు దర్శకులు ఏది చెబితే దానికి సై అనేవారు. ఇలా దర్శకులను గుడ్డిగా నమ్మటం వల్ల గతంలో ఘోరమైన డిజాస్టర్ లను కూడా సొంతం చేసుకోవాల్సి వచ్చింది అయితే ఇప్పుడు మాత్రం బాలయ్య కాస్త రూట్ మార్చారని తెలుస్తుంది సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని అందుకే వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారని స్పష్టమవుతుంది.

ఇకపోతే తాజాగా బాలకృష్ణ డాకు మహారాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు ఈ సినిమా పూర్తి కావడంతో తదుపరి అఖండ 2 సినిమా పనులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి వరుస సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో బోయపాటి పై బాలకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మరి బాలయ్య ఆగ్రహానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…

ముందుగా ఈ సినిమాలో ప్రగ్యా జైష్వాల్ హీరోయిన్గా తీసుకున్నారు అయితే ఆమె భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బోయపాటి ఆమె పాత్ర సినిమాలో చనిపోయినట్టు చూపించారు అనంతరం కొత్త హీరోయిన్స్ సంయుక్తను తీసుకున్నారు.ఈ విషయం బాలయ్యకు ముందుగా తెలియకపోవడంతో, ఒక కీలక సీన్ షూట్ చేస్తున్నప్పుడు ప్రగ్యా ఫోటో లేకపోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. సెట్‌లో ఆ సీన్ షూట్ అవుతున్నప్పుడు చనిపోయిన మనిషి ఫోటో ఎక్కడ అంటూ బాలయ్య ప్రశ్నించారట.

ఇలా బాలకృష్ణ అడగడంతో బోయపాటి మౌనంగా ఉన్నారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య వెంటనే ఆ ఫోటోని తెప్పించారు.అంతేకాకుండా, సినిమాలో విలన్ పాత్ర కోసం సంజయ్ దత్‌ను తీసుకోవాలని ఆలోచించి ఆ తర్వాత తన ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ ఏకంగా సంజయ్ దత్ కు ఫోన్ చేసి డేట్స్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్టు సమాచారం. అయితే సినిమాపై బాలయ్య చూపించే డెడికేషన్ కారణంగానే వీటన్నింటిని గమనిస్తూ షూటింగ్ జరుపుతున్నారని అందుకే డైరెక్టర్ తీరుపై కోప్పడ్డారని వార్తలు వస్తున్నాయి.