Boyapati: బాలయ్య అఖండ 2 కోసం హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న బోయపాటి….ఇక బ్లాక్ బస్టరే?

Boyapati: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అంటేనే సూపర్ హిట్ అని చెప్పాలి అలాంటి కాంబినేషన్లలో డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ ఒకటి అని చెప్పాలి. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్లో సుమారు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మూడు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో చివరిగా అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్స్ సన్ని వేషాలను బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బోయపాటికి కూడా అఖండ సినిమా తర్వాత సరైన సక్సెస్ మాత్రం లేదని చెప్పాలి. ఆఖండ తర్వాత బోయపాటి రామ్ హీరోగా స్కంద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలోనే ఆఖండ 2 పై భారీగా అంచనాలను పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను తన హిట్ సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి నటించబోతున్నట్టు సమాచారం. ఇదివరకు ఆది పినిశెట్టి విలన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం సరైనోడు ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ క్రమంలోనే అఖండ సినిమా సక్సెస్ కోసం ఈయన ఈ హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ఆది పినిశెట్టిని విలన్ గా తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.