NTR Heroine Gajala : ఎన్టీయార్ హీరోయిన్ గజాలా సినిమాలు మానేయడానికి కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

NTR Heroine Gajala : యంగ్ టైగర్ ఎన్టీయార్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ గుర్తుంది కదా. ‘స్టూడెంట్ నెం.1’. సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎన్టీయార్ యంగ్ టైగర్‌ ఇమేజ్ తెచ్చుకున్న సినిమా ఇది.
అయితే, ఈ సినిమా ముచ్చట ఇప్పుడెందుకంటారా.?  ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ గజాలా గురించి కొన్నిఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చర్చించుకుందాం.
‘స్టూడెంట్ నెం.1’ సినిమా తర్వాత ‘తొట్టిగ్యాంగ్’ తదితర సినిమాల్లో నటించింది గజాలా.
వెంకటేష్‌తో ‘మల్లీశ్వరి’ సినిమాలో గజాలా నటించిన స్పెషల్ సాంగ్ అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ తర్వాత గజాలా పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మరి, ఆ తర్వాత గజాలా ఏమైనట్లు.? ఏముంది మామూలే. పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైపోయింది.
అయితే, హీరోయిన్‌గా అన్ని క్వాలిటీస్ వున్నప్పటికీ గజాలాకి బిగ్ ఆఫర్లు పెద్దగా రాకపోవడానికీ, స్టార్ ఇమేజ్ సంపాదించుకోలేకపోవడానికీ కారణం ఆమెకు అహంకారం చాలా ఎక్కువ.. అని ఇండస్ట్రీలో టాక్. అంతేకాదు, ఆమెకు సినిమాలంటే ప్యాషన్ కాదట. జస్ట్ టైమ్ పాస్ అట.
అందుకే ఆమెను లైట్ తీసుకున్నారనీ అంటుంటారు.
అయితే, అలాంటిదేం లేదనీ, చేసిన సినిమాలను డెడికేషన్‌తోనే చేశాననీ, కానీ, పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ లేదనీ గజాలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.