ఆ పదవిపై ఆశతో కేసీఆర్ రాజకీయాలు.. కోరిక తీరుతుందో లేదో?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏపీ తెలంగాణ రాష్ట్రాలుగా విడదీసి తెలంగాణకు సీఎం కావాలన్న కేసీఆర్ కోరిక ఇప్పటికే రెండుసార్లు నెరవేరింది. కేసీఆర్ కు సరితూగే నాయకుడు లేకపోవడం తెలంగాణలో కేసీఆర్ కు ప్లస్ అయింది. ఇతర పార్టీలు తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తాయని ప్రజలు నమ్మకపోవడం కుడా టీ.ఆర్.ఎస్ అధికారంలోకి రావడానికి ఒక విధంగా కారణమైందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం కేసీఆర్ రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినా కేసీఆర్ ప్రధాని కావడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే. ఈ కారణం వల్లే జాతీయ పార్టీపై కేసీఆర్ దృష్టి పెట్టారు. కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించి ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడటం లేదని బోగట్టా. అయితే ప్రధాని కావాలనే కేసీఆర్ కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది. జాతీయ రాజకీయాల్లో అధికారంలోకి రావడానికి ఉన్న ఏ అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు.

తమ పార్టీ గురించి జాతీయ స్థాయిలో ప్రచారం జరిగే విధంగా కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. జాతీయ పార్టీకి సంబంధించిన యాడ్ కోసం కేసీఆర్ ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడటం లేదని తెలుస్తోంది. పార్టీ బ్యాంక్ ఖాతాలలో ఉన్న డబ్బును కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

కేసీఆర్ కు ఇప్పటికే ఇతర రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతీయ పార్టీల సపోర్ట్ ఉంది. అయితే సమయం వచ్చినప్పుడే ఆ పార్టీల మద్దతు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతంగా ఛార్టెడ్ ఫ్లైట్ ను కొనుగోలు చేయాలని కేసీఆర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ పార్టీ కవరేజ్ కోసం కేసీఆర్ కొన్ని ఛానెళ్లతో ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.