Hero Tested Covid Positive : షాకింగ్ : ఈ టాలీవుడ్ ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్.!

Hero Tested Covid Positive : టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దిగ్గజ కుటుంబాలు వాటి నుంచి వచ్చిన హీరోలు చాలా మంది ఉన్నారు. మరి ఆ కుటుంబాల్లో మంచు వారి కుటుంబం ఒకటి. అయితే జెన్యూన్ గా మాట్లాడాలి అంటే మంచు ఫ్యామిలీ నుంచి ఆడియెన్స్ కాస్త ఎక్కువ ఇష్టపడే ఏకైక హీరో ఎవరన్న ఉన్నారు అంటే అది మంచు మనోజ్ అనే చెప్తారు.

అయితే కెరీర్ పరంగా మంచు మనోజ్ సినిమాలకి చాలా కాలం దూరం అయ్యాడు. చాలా ప్లాప్ లు ఎదురవ్వడం తర్వాత తన పర్సనల్ లైఫ్ లో కూడా పెను మార్పులు కూడా ఎదురయ్యాయి. మరి ఇప్పుడు మనోజ్ అభిమానులకి ఊహించని షాక్ తగిలింది. తాజాగా మనోజ్ తాను కరోనా పాజిటివ్ అయ్యినట్టుగా తెలిపాడు. అయితే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు అని ప్రస్తుతానికి బాగానే ఉన్నానని తెలిపాడు.

అయితే రీసెంట్ గా అంతా నన్ను కలిసిన వారు కూడా ఒకసారి కరోనా టెస్ట్ చేయించుకోవాలని తెలిపాడు. అలానే తనకి చికిత్స చేస్తున్నటువంటి డాక్టర్లు మరియు వారి సిబ్బందికి స్పెషల్ థాంక్స్ ని చెప్తున్నానని మనోజ్ తెలిపాడు. దీనితో మనోజ్ త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.