షాకింగ్ : అక్కడ పవర్ స్టార్ కి గుండెపోటు అసలు విషయం ఏమిటంటే?

మన టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు వచ్చినట్టు అయితే పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అని తెలిసిందే. కానీ మనకి ఒక పవర్ స్టార్ ఉన్నట్టే కన్నడ ఇండస్ట్రీ కి కూడా ఒక పవర్ స్టార్ ఉన్నాడు అతడే పునీత్ రాజ్ కుమార్. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఉన్న ఈ హీరో మిరుమిట్లు కొలిపే డాన్స్ అలాగే ఏక్షన్ కి అక్కడ పెట్టింది పేరు కానీ అకస్మాత్తుగా తనకి సంబంధించి ఓ వార్త షాక్ ఇచ్చింది. తనకి ఆకస్మికంగా గుండెపోటు రావడం కలకలం రేపింది. 
 
అసలు విషయంలోకి వెళితే ఈరోజు ఉదయం జిమ్ లో జిమ్ చేస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందట. దీనితో వెంటనే 11 గంటల సమయంలో అతడిని అక్కడి విక్రమ్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉందట. దీనితో పునీత్ అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు అతడు తిరిగి కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. మరి ఈ స్టార్ హీరో త్వరగా కోలుకొని మళ్ళీ తన సినిమాలు తీసి అలరించాలని మనం కూడా కోరుకుందాం. తాను లాస్ట్ సినిమా “యువరత్న” తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే.