ఆ హీరోయిన్ కోసం భార్యనే చంపాలనుకున్న స్టార్ హీరో

హీరో, హీరోయిన్ల మధ్య లవ్ అఫైర్స్ సినిమా ఇండస్ట్రీ లో చాలా కామన్. హీరోయిన్ల మోజులో పడి భార్యల్ని వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. పెళ్లి అయి, పిల్లలు ఉన్నా కూడా ధర్మేంద్ర, కృష్ణ లాంటి ఆ నాటి స్టార్ హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ మధ్య సిద్ధర్థ్ కూడా హీరోయిన్ల మోజులో పడి భార్య కి విడాకులు ఇచ్చాడు, ప్రభు దేవా కూడా నయనతార కోసం తన భార్యని వదిలేసాడు. అలాగే ఆమిర్ ఖాన్ కూడా.

ఇలాంటిదే ఒక సీన్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ లో కూడా జరిగింది. కన్నడ లో టాప్ హీరో గా ఉన్న దర్శన్ ఒకానొక సందర్భంలో తాగిన మత్తులో తన భార్య పై దర్శన్ గన్ను పెట్టేవరకు వెళ్ళింది.

ఒక మూవీ షూటింగ్ లో దర్శన్ హీరోయిన్ నికిత తుక్రాల్ కి మధ్య చనువు పెరగడంతో ఇద్దరు రిలేషన్ లోకి వెళ్లిపోయారు. దీని పై తన భార్య దర్శన్ ని నిలదీయడంతో తన్ను చంపడానికి బెదిరించాడు కూడా.

ఆ ఇన్సిడెంట్ తో  విజయలక్ష్మి దర్శన్ పై పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు పెట్టింది. ఆ కేసులో దర్శన్ కి 14 రోజుల పాటు రిమాండ్ కూడా కోర్ట్ విధించింది. అయితే ఈ విషయం తెలియగానే కన్నడ ఇండస్ట్రీ అంతా ఉడికిపోయింది. తర్వాత కన్నడ ఇండస్ట్రీ నిఖిత పై చర్యలు తీసుకుంది. ఆమెను మూడేళ్ళ పాటు కన్నడ సినిమాల్లో నటించకుండా బాన్ విధించారు.