కర్ణాటక అసెంబ్లీకి జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది.  దివంగత స్టార్ పునీత్ కు ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే! నవంబర్ 1న జరిగే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమం లో పునీత్ భార్య కు ఈ పురస్కారం అందించనున్నారు. ఈ వేడుక లో సూపర్ స్టార్  రజనీకాంత్,  ఎన్టీఆర్ రావడానికి సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు.