షాకింగ్ ఫ్యాక్ట్ : ఇలా చేసి ఉంటే పునీత్ బతికే ఉండేవాడట.!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ఒక్క కన్నడ సినిమా ఇండస్ట్రీకి మాత్రం కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు స్టార్స్ ప్రేక్షకులని కూడా ఎంతగానో కదిలించివేసి కలచివేసింది. మంచి టాలెంటెడ్ హీరో అంతకు మించిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన పునీత్ మరణం చాలా బాధాకరం.

మరి జరిగిందేదో జరిగిపోయింది కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేం. కానీ అసలు పునీత్ మరణం జరగకుండా ఉండడానికి పునీత్ ఓ పని చేసి ఉంటే బాగుండేది అని షాకింగ్ నిజం ఒకటి జాతీయ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా వారు బయట పెట్టారు. పునీత్ మరణానికి ముందు రోజు రాత్రి సమయంలో అతడికి కాస్త ఒంట్లో బాగోలేదని తెలిపాడట.

అయినా కూడా తర్వాత రోజు ఉదయం జిమ్ కి వెళ్లిపోవడం వలెనే ఈ సడెన్ హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారని వారు వెల్లడి చేశారు. ఒకవేళ పునీత్ కానీ ఆ రెండు రోజులు రెస్ట్ తీసుకొని జిమ్ కి వెళ్లకుండా ఉంటే బతికి ఉండేవాడని తెలిపారు. దీనితో ఈ షాకింగ్ నిజం విని అభిమానులు మరింత బాధ వ్యక్తం చేస్తున్నారు.