Adipurush : బిగ్ అప్డేట్ : ప్రభాస్ “ఆదిపురుష్” నుంచి ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి?

Adipurush : ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా చిత్రాల్లో ఫస్ట్ టైం బాలీవుడ్ దర్శకుడు తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కగా దీనిలో ప్రభాస్ రాముడిగా నటించాడు.
అయితే ప్రభాస్ ఫస్ట్ టైం ఇలాంటి ఒక పాత్రలో నటిస్తుండగా అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. మరి ఈ ఏడాది ప్రభాస్ నుంచి రానున్న భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి కాగా అన్ని వర్గాల్లో ఈ సినిమాపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమాపై ఒక ఊహించని అప్డేట్ ని అందించారు.
ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించిన ఈ సినిమాని ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం అని భారీ అనౌన్స్ మెంట్ తో ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ అనౌన్సమెంట్ లో డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. 2023 జనవరి 12న ఈ సినిమా ప్రపంచ స్థాయిలో 3D లో రిలీజ్ చేస్తునట్టు తెలిపారు.
అంటే అప్పటివరకు ప్రభాస్ అభిమానులకు పడిగాపులు తప్పవని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కృతి సనన్ సీత పాత్రలో నటించగా బాలీవుడ్ కి చెందిన మరో స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో నటించాడు.
https://twitter.com/RETROPHILES1/status/1498473384807579651?s=20&t=OgDPImphh3HoCrAhJ3EwVA