Yash: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సాయి పల్లవి కలిసి నటిస్తున్న సినిమా రామాయణం. నమిత మల్హోత్రా,యష్ నిర్మాణంలో నితీష్ తివారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరక్కెక్కనుంది. ఈ సినిమాలో యష్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా రామాయణం సినిమా కోసం హాలీవుడ్కు చెందిన ప్రముఖ స్టంట్ డైరెక్టర్ గై నోరిస్‌తో కలిసి యాక్షన్ సన్నివేశాలపై పని చేస్తున్నారు. రామాయణం కోసం ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చి యాక్షన్ సన్నివేశాలు డైరెక్ట్ చేస్తున్నారు.
ఇకపోతే హీరో యశ్ రామాయణం సినిమాలో రావణాసురుడి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో యశ్, గై నోరిస్ యాక్షన్ సీన్స్ ని చర్చిస్తున్న ఫోటోలను రిలీజ్ చేసారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో ఎప్పటిలాగే చాలా స్టైలిష్ గా కనిపించారు యశ్. ఇకపోతే రామాయణం పార్ట్ వన్ సినిమా దీపావళి పండుగ కానుకగా 2026 లో విడుదల కాబోతుండగా రెండవ భాగం దీపావళి కానుకగా 2027లో విడుదల కానున్నట్లు మూవీమేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఇకపోతే హీరో యశ్ విషయానికి వస్తే.. కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా యశ్ కి భారీగా గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అయితే ఈ సినిమా ముందు వరకు యశ్ అన్న విషయం చాలామందికి తెలియదు. కానీ ఒక కేజీఎఫ్ సినిమాతో రాత్రికి రాత్రికే స్టార్ గా మారిపోయాడు యశ్. అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రామాయణం సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కావడంతో సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.