టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ పేరు వినగానే ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అభిమానులు.. ఫుల్ కుష్ అవుతారు. అతడో టాప్ హీరో, స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు. రాబోయే సినిమాలపై ఎంతగా అంచనాలున్నాయో, అంతకంటే ఎక్కువగా ప్రభాస్ పెళ్లిపై ఉత్కంఠ ఉంది. వయసు 45 దాటినా ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉండటంతో, దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పిలవబడుతున్నాడు ప్రభాస్. అందం, ఆస్తి, స్టార్ డమ్ అన్నీ కలిగి ఉన్నా.. ప్రభాస్ కు పెళ్లి ఎందుకు ఆలస్యం అవుతోంది అనే ప్రశ్న మాత్రం అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.
కొన్ని సంవత్సరాల క్రితం.. ప్రభాస్ అనుష్క శెట్టి వివాహం చేసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించడంతో పాటు, బయట కూడా క్లోజ్‌గా కనిపించడంతో వీరి మధ్య సీక్రెట్ రిలేషన్‌షిప్ ఉందని ఎన్నో రూమర్లు వచ్చాయి.. పెళ్లి కూడా త్వరలోనే జరిగిపోతుందని టాక్ ఎన్నోసార్లు బయటకొచ్చినా, అందుకు ఎలాంటి అధికారిక నిర్ధారణ మాత్రం ఇప్పటిదాకా లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ప్రచురించిన కథనం మరోసారి చర్చకు తావిస్తోంది. ప్రభాస్–అనుష్క నిజంగా ఒకరినొకరు ఇష్టపడ్డారని, వీరి వివాహానికి కుటుంబాల అంగీకారమూ లభించిందని కానీ.. ఒ ఒక్క కారణం వలనే వీరి వివాహం ఆగిపోయిందని పేర్కొంది.
ప్రభాస్, అనుష్కలు ఒకరినొకరు ప్రేమించుకున్నా.. వీరి జాతకాలు కలవకపోవడంతో పెళ్లి ఆగిపోయిందని అందులో పేర్కొంది. ఈ కారణంతోనే ఇద్దరూ దూరమయ్యారని.. చెబుతున్నారు. అయితే ఇది తెలిసిన తర్వాత.. డార్లింగ్ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారన్నదే తాజా బజ్. పైగా, జాతకాల విషయంలో ప్రభాస్, అనుష్క ఇద్దరూ నమ్మకం ఉన్నవారే కావడంతో, ఈ విషయం మరింత బలంగా వినిపిస్తోంది.
ఇక ప్రభాస్ పెళ్లిపై ఆయన కుటుంబం కూడా గతంలో పలు సందర్భాల్లో స్పందించింది. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ … తాము కూడా ప్రభాస్ పెళ్లికి ఎదురు చూస్తున్నాం అని తెలిపారు.. దేవుడు అందరికీ సరైన సమయాన్ని కచ్చితంగా ఇస్తాడు. శుభగడియలు వచ్చినపుడే అన్నీ జరుగుతాయి అని చెప్పారు.
ప్రభాస్ ఇష్టపడే అమ్మాయి లక్షణాలపై ఆమె మాట్లాడుతూ.. తమది పెద్ద కుటుంబం. అందరితో కలిసిపోయే, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అంటే ప్రభాస్‌కు ఇష్టం. ఇతరుల్ని విమర్శించే వాళ్లను ఆయన ఇష్టపడడు అని తెలిపారు. నెగటివ్‌గా ఉండే స్వభావాలు ప్రభాస్ దూరంగా ఉంటాడని తెలిపారు.
ఎన్నో రూమర్లు, వార్తలు వచ్చినా ప్రభాస్ మాత్రం ఎప్పటిలాగే మౌనమే వహిస్తున్నాడు. ఆయన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ, అభిమానుల ఆశలు మాత్రం ఆ శుభ ఘడియలు ఎప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక రోజు అది నిజమవుతుందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.